సమానత్వం కోసం రామానుజచార్యులు వెయ్యేళ్ల క్రితమే కృషి చేశారని ఏపీ సీఎం వైఎస్ జగన్ చెప్పారు.సమతామూర్తిని జగన్ ఇవాళ దర్శించకొన్నారు.
హైదరాబాద్: వెయ్యేళ్ల క్రితమే సఃమానత్వం కోసం రామానుజచార్యులు పోరాటం చేశారని ఏపీ సీఎం వైఎస్ జగన్ చెప్పారు. రామానుజచార్యలు బోధనలు ఇప్పటికీ అనుసరణీయమేనని ఆయన అభిప్రాయపడ్డారు.

ఆంధ్రప్రదేశ్ సీఎం YS Jagan సోమవారం నాడు సాయంత్రం ముచ్చింతల్ లోని Samata Murthy statue కేంద్రాన్ని దర్శించుకొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. సమతామూర్తి కేంద్రాన్ని దర్శించుకోవడం తనకు చాలా సంతోషాన్ని ఇచ్చిందన్నారు. Jeeyar Swamy ఆధ్వారంలో రామానుజచార్యుల విగ్రహన్ని ఆవిష్కరించుకోవడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. Ramanujacharya ఆనాడు ఏ విలువల కోసం నిలబడ్డాడో అదే విలువల కోసం పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు.

గొప్ప ఉద్దేశ్యంతో రామానుజచార్యులు పనిచేశారని సీఎం జగన్ ప్రస్తావించారు. అమెరికా నుండి వచ్చిన చిన్నారులు విష్ణు సహస్రనామ అవధానం చేయడాన్ని ఆయన అభినందించారు.అంతకు ముందు ప్రవాస భారతీయ చిన్నారులు విష్ణు సహస్రనామ అవధానాన్ని సీఎం వైఎస్ జగన్ తిలకించారు. విష్ణు సహస్రనామ అవధానంలో పాల్గొన్న చిన్నారులకు సీఎం జగన్ పుస్తకాలను అందించారు. సమతామూర్తి విగ్రహన్ని సీఎం జగన్ దర్శించుకొన్నారు. విగ్రహ విశేషాలను సీఎం జగన్ కు చిన జీయర్ స్వామి వివరించారు.

