హైదరాబాద్: ఏపీ సీఎం వైఎస్ జగన్ హైద్రాబాద్‌ ప్రగతి భవన్‌లో శుక్రవారం నాడు తెలంగాణ సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యారు. రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యలను పరిష్కరించుకొనేందుకు ఇద్దరు సీఎంలు సమావేశమయ్యారు.

గోదావని నది నీలిని కృష్ణా బేసీన్‌కు తరలించడం లక్ష్యంగా  రెండు రాష్ట్రాల సీఎంలు చర్చించనున్నారు. ఇవాళ, రేపు రెండు రోజుల పాటు ఈ సమావేశాలు జరగనున్నాయి.ఏపీ తరపున సీఎం జగన్‌తో పాటు  మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, పేర్నినాని, అనిల్ కుమార్ యాదవ్, కన్న బాబు, పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి, బాలినేని శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.  వీరితో పాటు   సీఎస్  ఎల్వీ సుబ్రమణ్యం, అజయ్ కల్లం, సజ్జల రామకృష్ణారెడ్డిలు పాల్గొన్నారు.

తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రశాంత్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్‌లు పాల్గొన్నారు.  పార్టీ సెక్రటరీ జనరల్ కే. కేశవరావులు పాల్గొన్నారు.రిటైర్డ్  ఇంజనీర్ల ఫోరం ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

తొలి రోజు ఉదయం నుండి సాయంత్రం వరకు ఇద్దరు సీఎంలు ఈ సమావేశంలో పాల్గొంటారు.ఇవాళ ఆరు అంశాలపై చర్చ జరగనుంది. గోదావరి నది నీటిని కృష్ణా బేసిన్‌కు తరలించడంపై ప్రధానంగా చర్చించనున్నారు.  

రెండు రాష్ట్రాల మధ్య పెండింగ్‌లో ఉన్న సమస్యలు, 9, 10వ షెడ్యూల్ విభజనతో పాటు రెండు రాష్ట్రాల మధ్య విద్యుత్ బకాయిల వివాదాలపై ఇద్దరు సీఎంలు చర్చించనున్నారు.ఢిల్లీలోని ఏపీ భవన్ విభజన, ఉద్యోగుల విభజన వంటి అంశాలపై ఇద్దరు సీఎంలు చర్చిస్తారు.

గోదావరి నుండి ప్రతి ఏటా 3 వేల టీఎంసీల నీటిని సద్వినియోగం చేసుకొనే ఉద్దేశ్యంతో రెండు రాష్ట్రాల  సంయుక్తంగా  ఉమ్మడి ప్రాజెక్టును నిర్మించాలని సీఎంలు భావిస్తున్నారు. ఎక్కడి నుండి ప్రాజెక్టును నిర్మించే విషయమై ఈ సమావేశంలో  చర్చించనున్నారు.

పోలవరం కుడి కాలువ నుండి నాగార్జున సాగర్ నుండి శ్రీశైలంలోకి నీటిని మళ్లించాలనే ప్రతిపాదన కూడ ఉంది. దుమ్ముగూడెం నుండి  సాగర్ కు నీటిని మళ్లించాలనే ప్రతిపాదన కూడ ముఖ్యమంత్రుల మధ్య చర్చ జరిగే అవకాశం ఉంది.

;ప్రగతి భవన్ కు చేరుకొన్న జగన్ కు తెలంగాణ సీఎం కేసీఆర్ తో పాటు ఆయన మంత్రివ వర్గ సహచరులు స్వాగతం పలికారు. ప్రగతి భవన్ లో కొద్దిసేపు జగన్ , కేసీఆర్ లు ముఖాముఖి సమావేశమయ్యారు. ఆ తర్వాత ఇద్దరు రాష్ట్రాల  సీఎంల మధ్య సమావేశం ప్రారంభమైంది.