టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ 66వ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు ఏపీ సీఎం వైఎస్ జగన్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్‌కు దేవుడి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని.. ఆయన జీవితాంతం ఆయురారోగ్యాలతో ప్రజాసేవలో కొనసాగాలంటూ జగన్ ట్వీట్ చేశారు.

ఆయనతో పాటు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తిరుమల వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఆయన ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని, ప్రజలకు సేవ చేస్తూ ఉండాలని ఆకాంక్షించారు.

ఇక ప్రధాని నరేంద్రమోడీ సైతం చంద్రశేఖర్ రావుకు ట్విట్టర్ ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత చంద్రబాబు కూడా కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.