అమరావతి:మన చేతుల్లో లేని అంశాలకు కూడ మనం బాధ్యత వహించాల్సి వస్తోందని ఏపీ సీఎం వైఎస్ జగన్  చెప్పారు. స్పందన కార్యక్రమంలో భాగంగా ఏపీ సీఎం వైఎస్ జగన్  మంగళవారం నాడు రాష్ట్రంలోని పలు జిల్లాల ఎస్పీలు, కలెక్టర్లతో మాట్లాడారు.సోమవారం నాడు రుయా ఆసుపత్రిలో చోటు చేసుకొన్న ఘటనలపై సీఎం ఈ సందర్భంగా వ్యాఖ్యలు చేశారు.  రాష్ట్రంలో కరోనా విషయమై చంద్రబాబునాయుడు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. 

అధికారం లేని విషయాన్ని జీర్ణించుకోలేక  చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. వ్యాక్సిన్ల పరిస్థితి దేశంలో అందరికీ తెలుసునని ఆయన చెప్పారు. కోవిషీల్డ్ నెలకు 6 కోట్లు ఉత్పత్తి చేస్తోంటే కోవాగ్జిన్  కోటి డోసులు ఉత్పత్తి చేస్తోందని ఆయన గుర్తు చేశారు. సోమవారం నాడు రాత్రి ఆక్సిజన్ అందక రుయా ఆసుపత్రిలో 11 మంది రోగులు మరణించారు. ఆక్సిజన్ ట్యాంకర్ తమిళనాడు నుండి 20 నిమిషాలు ఆలస్యంగా రావడంతో ఈ పరిస్థితి నెలకొంది