బాసర ట్రిపుల్ ఐటీలో మరో విద్యార్ధి ఆత్మహత్య.. మూడు నెలల వ్యవధిలో ముగ్గురు బలవన్మరణం
నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో మరో విద్యార్ధి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. బబ్లూను సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌కు చెందిన విద్యార్ధిగా గుర్తించారు.
నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో మరో విద్యార్ధి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. జాదవ్ బబ్లూ అనే విద్యార్ధి హాస్టల్‌లో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. వ్యక్తిగత కారణాలతోనే విద్యార్ధి ఆత్మహత్య చేసుకున్నాడని ట్రిపుల్ ఐటీ అధికారులు తెలిపారు. బబ్లూను సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌కు చెందిన విద్యార్ధిగా గుర్తించారు. మూడు నెలల వ్యవధిలో ముగ్గురు విద్యార్ధులు ట్రిపుల్ ఐటీలో బలవన్మరణానికి పాల్పడటంతో కలకలం రేపుతోంది. తాజా మరణంపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.