హైదరాబాద్ ఐఐటీలో మరో విద్యార్థిని ఆత్మహత్య...చదువుల ఒత్తిడి తట్టుకోలేక అంటూ సూసైడ్ లెటర్...
హైదరాబాద్ ఐఐటీ క్యాంపస్ లో మరో విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. మమైతా నాయక్ అనే విద్యార్థిని హాస్టల్ గదిలో ఫ్యాన్ కు ఉరివేసుకుని మృతి చెందింది.
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో ఐఐటీ విద్యార్థుల వరుస ఆత్మహత్యలకు కలకలం రేపుతున్నాయి. గతనెల కార్తీక్ అనే విద్యార్థి క్యాంపస్ నుంచి వెళ్లి విశాఖ బీచ్ లో ఆత్మహత్య చేసుకున్న ఘటన మరువకముందే.. సోమవారం మరో విద్యార్థిని మృతి చెందింది. హైదరాబాద్ ఐఐటీ క్యాంపస్ లో ఎంటెక్ చదువుతున్న మమైతానాయక్ అనే విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
క్యాంపల్ హాస్టల్ లోని తన గదిలో ఉరి వేసుకుని మరణించింది. చదువుల ఒత్తిడి భరించలేకే ఆత్మహత్య చేసుకుంటున్నట్లుగా సూసైడ్ నోట్ రాసింది. ఇది గమనించిన సిబ్బంది వెంటనే ఆమెను సంగారెడ్డి ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లుగా తేలింది. అక్కడి మార్చురీలో ఆమె మృతదేహాన్ని ఉంచారు.
మమైతానాయక్ ఒడిశాకు చెందిన విద్యార్థిని. తల్లిదండ్రులకు సమాచారం అందించడంతో వారు ఒడిశానుంచి హుటాహుటిన హైదరాబాద్ కు చేరుకున్నారు. మొదట కాలేజీకి వెళ్లి.. అక్కడినుంచి హాస్పిటల్ కు వెళ్లారు. నిరుడు ఆగస్ట్ నుంచి ఇప్పటివరకు ఈ క్యాంపస్ లో 4 విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. నిరుడు ఆగస్ట్ 31న ఒకరు, సెప్టెంబర్ 7న ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు.
ఇక గతనెల 15న కార్తీక్ అనే విద్యార్థి ఇంటికి వెడుతున్నానని చెప్పి క్యాంపస్ నుంచి వెళ్లాడు. ఆ తరువాత నాలుగు రోజులకు విశాఖ బీచ్ లో శవంగా దొరికాడు. అతను ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. తాజాగా మమైతా నాయక్ ఈ వరుస ఆత్మహత్యలు కలవరం రేపుతున్నాయి.
ఐఐటి హైదరాబాద్ విద్యార్థిని సూసైడ్ కేసులో కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. పది రోజుల క్రితమే మమత నాయక్ ఒడిశాకు వెళ్లి వచ్చింది. చదువులోకి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. మొదట చున్నితో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించింది. కానీ చున్నీ తెగిపోవడంతో వైర్ తో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది.
సాయంత్రం 5 గంటలకు ఆమె క్యాంపస్ నుంచి హాస్టల్ కు వెళ్లింది. తరువాత రాత్రి 8 గం.ల ప్రాంతంలో భోజనం చేయడానికి కూడా రాకపోవడంతో తోటి విద్యార్థినులు రూంకు వెళ్లగా, లోపలినుంచి గడియపెట్టి ఉంది. ఎంత కొట్టినా తలుపు తీయకపోవడంతో వారు యాజమాన్యానికి సమాచారం అందించారు. వారు వచ్చి బలవంతంగా తలుపులు తెరవగా మమైతా నాయక్ మృతి చెంది కనిపించింది.
అక్కడ మొదట ఆమె చున్నీలో ఉరివేసుకోవడానికి ప్రయత్నించినట్టుగా కనిపిస్తోంది. అయితే, చున్నీ తెగిపోతే బతికే అవకాశం ఉండడంతో.. మనసు మార్చుకుని వైర్ తో ఉరివేసుకున్నట్లు అనుమానిస్తున్నారు. ఆమె తల్లిదండ్రులు కూడా సంగారెడ్డిలోని క్యాంపస్ కు చేరుకున్నారు. కూతురు మృతిపై హృదయవిదారకంగా ఏడుస్తున్నారు.