వచ్చే లోకసభ ఎన్నికల్లో సీతారాం నాయక్ కు వచ్చే ఎన్నికల్లో సీటు ఇవ్వబోమని టీఆర్ఎస్ నాయకత్వం సంకేతాలు ఇచ్చినట్లు చెబుతున్నారు. కేరళకు చెందిన ఐపీఎస్‌ అధికారి లక్ష్మణ్‌ నాయక్‌ను టీఆర్‌ఎస్ మహబూబాబాద్ లోకసభ సీట్లో పోటీకి దించాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.

వరంగల్: కాంగ్రెసు కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పక్కా సమాచారంతోనే ప్రకటన చేసినట్లు కనిపిస్తున్నారు. చేవెళ్ల ఎంపీ విశ్వేశ్వర రెడ్డితో పాటు మహబూబాబాద్ ఎంపీ సీతారాం నాయక్ కూడా కారు దిగుతారనే ప్రచారం సాగుతోంది. సీతారాం నాయక్ పార్టీ మారడానికి కేరళ ఎఫెక్ట్ కారణమని వార్తలు వచ్చాయి. 

వచ్చే లోకసభ ఎన్నికల్లో సీతారాం నాయక్ కు వచ్చే ఎన్నికల్లో సీటు ఇవ్వబోమని టీఆర్ఎస్ నాయకత్వం సంకేతాలు ఇచ్చినట్లు చెబుతున్నారు. కేరళకు చెందిన ఐపీఎస్‌ అధికారి లక్ష్మణ్‌ నాయక్‌ను టీఆర్‌ఎస్ మహబూబాబాద్ లోకసభ సీట్లో పోటీకి దించాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ స్థితిలో సీతారాం నాయక్ టీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెసులో చేరాలని నిర్ణయించుకున్నారని అంటున్నారు. మహబూబాబాద్‌ లోకసభ సీటుకు కాంగ్రెస్‌ నుంచి గతంలో పోటీచేసిన కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్‌ ప్రస్తంత మహబూబాబాద్‌ అసెంబ్లీ నుంచి పోటీ చేస్తున్నారు. ఇది సీతారాం నాయక్ కు కలిసి వచ్చే విషయమని అంటున్నారు.

మహబూబాబాద్‌ లోక్‌సభకు పోటీచేసే అవకాశం కల్పిస్తామన్న కాంగ్రెసు హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు. దీంతో సీతారాం నాయక్‌ కాంగ్రెస్‌లో చేరుతున్నట్టు తెలుస్తోంది.