తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని సాగు, తాగు నీటి బాధలను శాశ్వతంగా పారదోలేందుకు చేపడుతున్న బృహత్తర ప్రాజెక్టు కాళేశ్వరం. పేరుకు తగ్గట్లే ఆ మహాశివుడు తలపై గంగను దాచినట్లే ఈ భారీ ప్రాజెక్టులో  గోదావరి నీటిని నిల్వ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పించారు. దీని ద్వారా రాష్ట్రంలోని ప్రతి గుంట భూమికి సాగునీరు అందించి ''తెలంగాణను కోటి ఎకరాల మాగాణం'' మార్చాలని చూస్తున్నారు. అందువల్లే ఈ ప్రాజెక్టు పనులు యుద్దప్రాతిపదికన జరుగుతూ ఒక్కో దశను పూర్తిచేసుకుంటున్నాయి. 

ఇలా ఇవాళ ఈ ప్రాజెక్టులో మరో కీలకమైన ముందడుగు పడింది.  ఆరో ప్యాకేజీలో భాగంగా పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నందిమేడారం వద్ద భూగర్భంలో పంప్ హౌజ్ ను నిర్మించిన విషయం తెలిసిందే. దీని నుండి భారీ మోటార్ల  ద్వారా నీటిని మేడారం రిజర్వాయర్‌లో ఎత్తిపోయనున్నారు. ఇందుకోసం ఆరు  భారీ మోటార్లను ఏర్పాటుచేశారు. వీటిలో ఒకటి, రెండు మోటార్ల వెట్ రన్ గత నెల 24,25 తేదీల్లో చేపట్టగా తాజాగా మూడో మోటార్ వెట్ రన్ ను ఇవాళ పూర్తిచేశారు. 

అయితే మిగతా మూడు మోటార్ల వెట్ రన్ లను కూడా త్వరలో చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. మొత్తంగా జూన్ రెండోవారం నాటికి ఆరు మోటార్ల ను అందుబాటులోకి తెచ్చి గోదావరి జలాలతో మేడారం రిజర్వాయర్ నింపనున్నట్లు వెల్లడించారు.  

వీడియో

"