సికింద్రాబాద్ లో బాలికపై సామూహిక అత్యాచారం.. ఇన్ స్టాగ్రాంలో పరిచయం, వీడియో ఇస్తానని పిలిచి..

సికింద్రాబాద్ లో ఓ బాలికపై ఐదుగురు సామూహిక అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మొదట ఇద్దరు ఆమె మీద అత్యాచారం చేసి వీడియో తీశారు. అది ఇస్తానని పిలిచి స్నేహితులతో కలిసి మరోసారి గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు.

another minor girl gang raped in secunderabad

సికింద్రాబాద్ : జూబ్లీహిల్స్ లో బాలికపై gang rape ఘటన మరువకముందే Secunderabad పరిధిలో మైనర్ పై సామూహిక అత్యాచార ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కార్ఖానా పరిధిలో బాలికపై ఐదుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు ఐదుగురిని అరెస్టు చేశారు. POCSO ACT కింద కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. నిందితుల్లో minor boy కూడా ఉన్నాడు. బాలికతో Instagram లో పరిచయం పెంచుకున్న నిందితులు ధీరజ్, రితేశ్ బాలికకు మాయమాటలు చెప్పి శారీరకంగా లోబర్చుకున్నారు.

అత్యాచారం చేసిన సమయంలో వీడియోలు తీసి ధీరజ్, రితేష్ బాలికను భయపెట్టారు. వీడియోలు ఇస్తానని చెప్పి పిలిచి.. ఇతర స్నేహితులతో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన దాదాపు రెండు నెలల క్రితం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. బాలిక పరిస్థితి చూసి ఆమె కుటుంబ సభ్యులు మానసిక నిపుణుడి దగ్గరికి తీసుకువెళ్ళారు.  మానసిక నిపుణుడు వద్ద బాలిక జరిగిన విషయం చెప్పింది. దీంతో బాలిక కుటుంబ సభ్యులు మే 30న పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

ఇదిలా ఉండగా, హైదరాబాదులో మరో బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన నిన్న ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రోడ్డు పక్కన వెళుతున్న 12ఏళ్ల బాలిక ఇంటి దగ్గర డ్రాప్ చేస్తానని చెప్పి ఒక క్యాబ్ డ్రైవర్ అతడి స్నేహితుడు కలిసి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ కేసులో నిందితులు కిషన్ బాగ్ ప్రాంతానికి చెందిన క్యాబ్ డ్రైవర్ షేక్‌ కలీం అలీ, మహ్మద్‌ లుక్మన్‌ అహ్మద్‌ యజ్దానీలను శుక్రవారమే అరెస్టు చేసినా.. జూబ్లీహిల్స్ కేసుపై ప్రతిపక్షాలు ఆందోళన నేపథ్యంలో విషయాన్ని గోప్యంగా ఉంచారు. ఈ విషయం మీడియాకు లీక్ కావడంతో ఆదివారం పత్రికా ప్రకటన విడుదల చేశారు.

వివరాల్లోకివెడితే.. హైదరాబాద్ లో పహాడీ షరీఫ్ సమీపంలోని షాహిన్‌నగర్‌ ప్రాంతానికి చెందిన 12 ఏళ్ల బాలిక సుల్తాన్ షాహీలోని తన మేనమామ ఇంట్లో ఉంటుంది. తల్లిదండ్రులను చూడాలనిపించడంతో గత మంగళవారం మే 31న సాయంత్రం 6 గంటలకు సుల్తాన్‌షాహీ నుంచి కాలినడకన బయలుదేరింది. రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో పహాడీ షరీఫ్  కమాన్ వద్దకు చేరుకుంది. ఆ సమయంలో అటుగా కారులో వెళుతున్న క్యాబ్ డ్రైవర్ షేక్ సలీం అలీ బాలికను గమనించి ఆగాడు.

ఎక్కడికి వెళ్తున్నావ్ అంటూ మాట కలిపాడు. షాహిన్ నగర్ లో ఉన్న తల్లిదండ్రుల వద్దకు వెళ్లాలని, డబ్బులు లేకపోవడంతో నడుచుకుంటూ వెళుతున్నాను అని ఆమె చెప్పింది. దీనిని ఆసరాగా తీసుకున్న కలీం.. డబ్బులు లేకపోయినా ఫర్వాలేదు, ఇంటివద్ద దింపేస్తానని బాలికను తన క్యాబ్ ఎక్కించుకున్నాడు. ముర్గి చౌక్ ప్రాంతంలో పని ఉందని, అది చూసుకున్నాక దింపేస్తానని చెప్పాడు. రాత్రి 10 గంటల దాకా వివిధ ప్రాంతాల్లో తిప్పి.. తన స్నేహితుడైన మహ్మద్‌ లుక్మన్‌ అహ్మద్‌ యజ్దానీకి ఫోన్ చేశాడు.
 
బస్తీలోని డెక్కన్ ప్యాలెస్ వద్దకు వచ్చిన యజ్దానీ వీరి కారు ఎక్కాడు. ఇద్దరు కలిసి బాలికను కుందుర్గ్ లోని యజ్దానీ ఇంటికి తీసుకు వెళ్లారు. అక్కడే బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాలిక తీవ్రంగా ఏడుస్తుండడంతో భయపడిన కలీం.. అర్ధరాత్రి తర్వాత ఆమెను కారులో సుల్తాన్ షాహీ వద్ద విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. మరోవైపు రాత్రి 12:15 గంటల సమయంలో బాలిక బంధువులు ఆమె కనిపించడం లేదంటూ మొగల్పురా పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి,గత శుక్రవారం నిందితులను పట్టుకుని కోర్టులో హాజరుపరిచారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios