కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. ఆయనపై శాయంపేట పోలీస్ స్టేషన్లో బెదిరింపుల కేసు నమోదయింది. ఐదు సెక్షన్ల కింద గండ్రపై పోలీసులు కేసు నమోదు చేశారు.

తనపై కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా  రెడ్డితో పాటు అతడి తమ్ముడు గండ్ర భూపాల్ రెడ్డి బెదిరింపులకు పాల్పడుతున్నట్లు ఎర్రబెల్లి రవీందర్ రావు శాయంపేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గన్ బెదిరిస్తూ భయపెడుతున్నారంటూ రవీంధర్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. తనకు గండ్ర సోదరుల నుండి రక్షణ కల్పించాలంటూ ఇతడు పోలీసులను కోరాడు.

ఎర్రబెల్లి రవీంధర్ రావు ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు గండ్ర సోదరులపై కేసులు నమోదు చేశారు.ఐదు సెక్షన్ల కింద వీరిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఫిర్యాదులో పేర్కొన్న అంశాలపై విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.