ప్రగతి రిసార్ట్స్ ఎండీ జిబికె రావును బెదిరించాడనే ఆరోపణలపై రాకేష్ రెడ్డిపై తాజాగా కేసు నమోదైంది. రెండేళ్ల క్రితం రాకేష్ రెడ్డి తన అనుచరులతో కలిసి జిబికె రావును బెదిరించారని, కొన్ని డాక్యుమెంట్లపై సంతకాలు చేయించుకున్నాడని ఆరోపణలు వచ్చాయి.
హైదరాబాద్: ఎన్నారై పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసులో నిందితుడైన రాకేష్ రెడ్డిపై పోలీసులు మరో కేసు నమోదు చేశారు. రాకేష్ రెడ్డి వ్వవహారాలు ఒక్కటొక్కటే విచారణలో బయటపడుతున్నాయి.
ప్రగతి రిసార్ట్స్ ఎండీ జిబికె రావును బెదిరించాడనే ఆరోపణలపై రాకేష్ రెడ్డిపై తాజాగా కేసు నమోదైంది. రెండేళ్ల క్రితం రాకేష్ రెడ్డి తన అనుచరులతో కలిసి జిబికె రావును బెదిరించారని, కొన్ని డాక్యుమెంట్లపై సంతకాలు చేయించుకున్నాడని ఆరోపణలు వచ్చాయి.
ఆ డాక్యుమెంట్లను ఎరగా వేసి జిబికె రావును రాకేష్ రెడ్డి డబ్బులు డిమాండ్ చేస్తూ వచ్చాడని అంటున్నారు. చిగురుపాటి జయరాం హత్యకు సంబంధించి పోలీసులు అతనిపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.