హైదరాబాద్:  తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో జరిగిన ఏడాదిన్నర బాలుడు అంజి హత్య కేసు మిస్టరీ వీడింది. అంజిని అతని తల్లితో అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తే హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. తల్లి చేతుల్లోంచి బాలుడిని ఆమె ప్రియుడు ఎత్తుకెళ్లిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. 

నిజామాబాద్ బస్టాండ్ సమీపంలో ఈ నెల 18వ తేదీన నవీపేట దుండిగుట్టకు చెందిన లక్ష్మి తన కుమారుడితో కలిసి వేరే ఊరికి వెళ్తోంది. ఆ సమయంలో నాగరాజు అక్కడికి వచ్చి ఆమెకు మత్తు ఇచ్చి బాలుడిని ఎత్తుకెళ్లాడు. ఆ తర్వాత కుమారుడి కోసం ఆమె గాలించినా ఫలితం దక్కలేదు. 

Also Read: బాలుడి కిడ్నాప్.. చితకబాదిన కుటుంబసభ్యులు

25వ తేదీన నాగరాజు నిజామాబాద్ మున్సిపల్ ఆఫీసు వద్ద కనిపించాడు. అతన్ని బాలుడి తల్లిదండ్రులు చితకబాదారు. పోలీసులు నాగరాజును అదుపులోకి తీసుకుని విచారించారు. అంజి హత్య కేసులో నాగరాజు నిందితుడని పోలీసులు తెలిపారు. 

నాగరాజు ఈ నెల 18వ తేదీన బాలుడిని ఎత్తుకెళ్లిన తర్వాత అదే రోజు రాత్రి 11 గంటలకు మద్యం సేవించాడు. ఆదే రాత్రి బాసరకు చేరుకున్నాడు. బాలుడి తలపై సిమెంట్ దిమ్మెతో బలంగా కొట్టాడు. దాంతో తలకు తీవ్రమైన గాయమై బాలుడు మరణించాడు. మృతుడిని పొదల్లో పారేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. 

పోలీసులకు ఈ నెల 19వ తేదీిన బాసర రైల్వే స్టేషన్ సమీపంలో బాలుడి శవం కనిపించింది. దాంతో పోలీసులు అనుమానాస్పద కేసుగా నమోదు చేసుకున్నారు. ఆ తర్వాత విచారణ చేపట్టి కేసును ఛేదించారు.