క్యాసినో కేసులో ఈడీ దూకుడు: విచారణకు హజరైన ఏపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి
క్యాసినో కేసులో ఏపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి ఇవాళ ఈడీ విచారణకు హాజరయ్యారు. తెలంగాణకు చెందిన ఎమ్మెల్సీ రమణ, మెదక్ డీసీసీ బీ చైర్మెన్ దేవేందర్ రెడ్డికి కూడా ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు.
హైదరాబాద్: క్యాసినో కేసులో ఈడీ విచారణకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి గురువారంనాడు హజరయ్యారు. క్యాసినో కేసులో ఈడీ దూకుడుగా వెళ్తుంది. ఈ కేసులో ఇప్పటికే చీకోటి ప్రవీణ్ కుమార్ ను ఈడీ విచారించింది. చీకోటి ప్రవీణ్ తో సంబంధాలున్నవారిని ఈడీ అధికారులు ప్రస్తుతం విచారిస్తున్నారు. ఇటీవలనే నేపాల్ కు వెళ్లిన వారికి ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. నిన్ననే తలసాని మహేంద్ర యాదవ్, తలసాని ధర్మేంద్ర యాదవ్ లను ఈడీ అధికారులు 10 గంటలపాటు విచారించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్. రమణ, మెదక్ డీసీసీబీ చైర్మెన్ దేవేందర్ రెడ్డిలను విచారణకు రావాలని కూడా ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు.
అంతేకాదు ప్రముఖ వైద్యుడి వంశీకి కూడా ఈడీ అధికారులు జారీ చేశారు. గోవాతో పాటు విదేశాల్లో చీకోటి ప్రవీణ్ కుమార్ క్యాసినో నిర్వహించాడు. తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు చీకోటి ప్రవీణ్ కుమార్ నిర్వహించిన క్యాసినో కు హజరైనట్టుగా ఈడీ అధికారులు గుర్తించారు. వీరికి ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఫెమా నిబంధనలను ఉల్లంఘించడంతో పాటు హవాలా రూపంలో చెల్లించినట్టుగా ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు.ఈ విషయమై ఈడీ అధికారులు వీరిని విచారించనున్నారు. వరుసగా మూడు రోజులపాటు ఈడీ అధికారులు విచారించనున్నారు. ఈ ఏడాది ఆగస్టు మాసంలో చీకోటి ప్రవీణ్ కమార్ ను ఈడీ అధికారులు విచారించారు. చీకోటి ప్రవీణ్ ఇచ్చిన సమాచారంతో పాటు ఈడీ అధికారులు సేకరించిన సమాచారం ఆధారంగా విచారణ చేస్తున్నారు. క్యాసినో ఆడేందుకు విదేశాలకు వెళ్లిన వారిని ఈడీ అధికారులు విచారిస్తున్నారు.
also read:టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్ రమణకు ఈడీ నోటీసులు: విచారణకు రావాలని ఆదేశం
గోవాతో పాటు విదేశాల్లో కూడా క్యాసినోకు తెలుగు రాష్ట్రాల నుండి చీకోటి ప్రవీణ్ కుమార్ తీసుకెళ్లారని ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల నుండి ప్రత్యేక విమానాలతో పాటు ఇతర విమానాల్లో విదేశాలకు వెళ్లిన వారి వివరాలను ఈడీ సేకరించింది. క్యాసినో ఆడిన వారితోపాటు క్యాసినోలో డబ్బులు గెలిచినవారికి హవాలా రూపంలో చెల్లింపులు జరిగినట్టుగా అనుమానిస్తుంది హవాలా రూపంలో చెల్లింపులపై విషయమై ఈడీ అధికారులు విచారణ చేయనున్నారు. మళ్లీ విచారణకు రావాలని ఎప్పుడు కోరినా తాను విచారణకు హజరౌతానని చీకోటి ప్రవీణ్ కుమార్ ప్రకటించిన విషయం తెలిసిందే.
క్యాసినో కేసు విషయంలో అధికార టీఆర్ఎస్ పై బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. ఈ నోటీసుల ఆధారంగా విచారణకు హాజరైన వారిచ్చే సమాచారం ఆధారంగా ఈడీ అధికారులు తమ విచారణను కొనసాగించనున్నారు.