తెలంగాణలో (telangana) మరో ప్రముఖ సంస్థ పెట్టుబడులు పెట్టనుంది. పాలు, పాల ఉత్పత్తుల రంగంలో ప్రఖ్యాతిగాంచిన  అమూల్‌ సంస్థ (amul) రాష్ట్రంలో రూ.500 కోట్లు  పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చింది. ఈ మేరకు బుధవారం రాష్ట్ర పరిశ్రమల శాఖమంత్రి కేటీఆర్‌ (ktr) సమక్షంలో ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వంతో అమూల్ ఒప్పందం కుదుర్చుకొంది. 

తెలంగాణలో (telangana) మరో ప్రముఖ సంస్థ పెట్టుబడులు పెట్టనుంది. పాలు, పాల ఉత్పత్తుల రంగంలో ప్రఖ్యాతిగాంచిన అమూల్‌ సంస్థ (amul) రాష్ట్రంలో రూ.500 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చింది. ఈ మేరకు బుధవారం రాష్ట్ర పరిశ్రమల శాఖమంత్రి కేటీఆర్‌ (ktr) సమక్షంలో ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వంతో అమూల్ ఒప్పందం కుదుర్చుకొంది. రాష్ట్రంలోని స్పెషల్‌ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ జోన్‌లో మొదటి దశలో రూ.300 కోట్లు, రెండో దశలో రూ.200 కోట్ల పెట్టుబడి పెట్టనుంది.

దక్షిణ భారతదేశంలోనే అమూల్‌ తన తొలిప్లాంట్‌ను రోజుకు 5లక్షల లీటర్ల సామర్థ్యంతో ఏర్పాటు చేస్తున్నామని.. భవిష్యత్తులో దీన్ని 10 లక్షల లీటర్లకు పెంచుతామని సంస్థ తెలిపింది. ప్లాంట్‌ నిర్మాణంతో పెరుగు, మజ్జిగ, లస్సీ, పన్నీర్‌, స్వీట్స్‌ వంటి వాటిని ఇక్కడ ఉత్పత్తి చేయనున్నట్టు వెల్లడించింది. దీంతో పాటు బ్రెడ్‌, బిస్కెట్‌, బేకరీ పదార్థాలు కూడా ఉత్పత్తి చేయనుంది. తెలంగాణలో ప్లాంట్‌ ఏర్పాటుతో 500 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభిస్తుందని, తమ ఉత్పత్తులకు అవసరమైన పాలను తెలంగాణ నుంచే సేకరిస్తామని కంపెనీ హామీ ఇచ్చింది. 

ఈ సందర్భంగా అమూల్‌ కంపెనీని మంత్రి కేటీఆర్‌ అభినందించారు. తెలంగాణలో మరో శ్వేత విప్లవం ప్రారంభమైందని... పెట్టుబడి పెట్టేందుకు అమూల్‌ తెలంగాణను ఎంచుకోవడం ద్వారా ఇక్కడి పాడి పరిశ్రమకు ప్రోత్సాహకరంగా మారుతుందని కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. దక్షిణ భారతదేశంలోనే తన తొలి డెయిరీ ప్లాంటును తెలంగాణలో ఏర్పాటు చేస్తుండడంపై కంపెనీకి మంత్రి అభినందనలు తెలిపారు.