హైదరాబాద్:  పెళ్లి రోజునే అమృత కొడుకుకు జన్మనివ్వడంతో ప్రణయ్ మళ్లీ పుట్టాడని  తల్లిదండ్రులు చెబుతున్నారు. మిర్యాలగూడలో రక్షణ ఉండదనే కారణంగానే హైద్రాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో అమృత డెలీవరీ అయిందని బాలస్వామి చెప్పారు.  అమృతతో పాటు ఆమె కొడుకు కూడ క్షేమంగా ఉన్నారని బాలస్వామి ప్రకటించారు.

శుక్రవారం నాడు హైద్రాబాద్‌లో బాలస్వామి తన భార్యతో  కలిసి మీడియాతో మాట్లాడారు.మిర్యాలగూడలో ఉంటే తమకు రక్షణ ఉండదని భావించి హైద్రాబాద్‌కు వచ్చినట్టు చెప్పారు. మిర్యాలగూడలో గతంలో అమృత ట్రీట్‌మెంట్ చేసుకొన్న డాక్టర్ జ్యోతి మారుతీరావు ఫ్యామిలీ డాక్టర్ అని  బాలస్వామి దంపతులు చెప్పారు. 

అమృత డెలీవరీ కోసం ఏ ఆసుపత్రిలో చేర్పించారనే విషయమై మారుతీరావుకు సంబంధించిన వ్యక్తులు ఆరా తీశారని  బాలస్వామి చెప్పారు. ఈ విషయమై తమ వద్ద ఖచ్చితమైన సమాచారం ఉందన్నారు.ఈ కారణంగానే  హైద్రాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో అమృతకు డెలీవరీ చేయించామన్నారు. అమృత ఆసుపత్రి నుండి డిశ్చార్జీ అయినట్టు బాలస్వామి చెప్పారు.

అమృతతో పాటు బాబు కూడ క్షేమంగా ఉన్నారని  ఆయన చెప్పారు.  ఇంతకాలం పాటు తాము బతికుండడానికి పోలీసులు, మీడియానే కారణమని బాలస్వామి చెప్పారు.  

సంబంధిత వార్తలు

ప్రణయ్ పుట్టిన రోజు, పెళ్లి టైమ్‌కే అమృత డెలీవరీ

రక్షణ కోసమే హైద్రాబాద్‌లో అమృత డెలీవరీ: ప్రణయ్ తండ్రి
బాబుతో అమృత.. ఫోటో వైరల్

పెళ్లి రోజే డెలీవరీ: మగబిడ్డకు జన్మనిచ్చిన అమృతా ప్రణయ్

పెళ్లి రోజు.. ప్రణయ్ లేకుండానే..అమృత ఎమోషనల్ పోస్ట్