మేరీ మాటీ, మేరీ దేశ్: పవిత్ర మట్టితో ఢిల్లీ వరకు అమృత కలశ్ యాత్ర: బీజేపీ సీనియర్ నేత జితేందర్ రెడ్డి
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన పౌరులను గౌరవించుకోవడానికి మేరీ మాటీ, మేరీ దేశ్ కార్యక్రమాన్ని ప్రారంభించారని, ఈ కార్యక్రమం వచ్చే ఏడాది స్వాతంత్ర్య దినోత్సవం వరకు కొనసాగుతుందని బీజేపీ సీనియర్ లీడర్ జితేందర్ రెడ్డి తెలిపారు.
హైదరాబాద్: మేరీ మాటి, మేరా దేశ్(నా మట్టి, నా దేశం) పేరిట ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించారని మహబూబ్ నగర్ మాజీ ఎంపీ, బీజేపీ సీనియర్ నేత ఏపీ జితేందర్ రెడ్డి అన్నారు. దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన పౌరులను గౌవించడానికి స్వాతంత్ర్య దినోత్సవం వరకూ ఈ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. ప్రాణ త్యాగం చేసిన అమరుల జ్ఞాపకార్థం ప్రతి గ్రామాల్లో స్మారకాలు ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమానికి విశేష స్పందన వస్తున్నట్టు తెలిపారు.
దేశ ప్రజలంతా ఐక్యతతో ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారని బీజేపీ సీనియర్ లీడర్ జితేందర్ రెడ్డి తెలిపారు. మేరీ మాటి, మేరీ దేశ్ కార్యక్రమంలో భాగంగా ఇవాళ పాలమూరు పట్టణంలో మట్టి సేకరించారు. కొత్త గంజి నీలకంఠ మల్లికార్జున దేవస్థానం దగ్గర జితేందర్ రెడ్డి ఆధ్వర్యంలో మట్టి సేకరించారు.
ప్రజలు తాము సేకరించిన మట్టిని జితేందర్ రెడ్డికి అందించారు. దేశవ్యాప్తంగా కలశ్ యాత్ర చేపట్టనున్నట్టు జితేందర్ రెడ్డి వివరించారు. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి 7500 కలశాల్లో పవిత్ర మట్టిని దేశ రాజధాని ఢిల్లీకి తీసుకువస్తున్నట్టు తెలిపారు.
Also Read : లక్ష కెమెరాలు, ఒక హెలిప్యాడ్.. హైదరాబాద్ పోలీసుల కొత్త వార్ రూమ్ అదుర్స్
ఈ కార్యక్రమంలో బీజేపీ నేతల ధర్పల్లి హరికృష్ణ, జిల్లా అధ్యక్షులు వీర బ్రహ్మచారి పడాకుల బాలరాజ్, కృష్ణ వర్ధన్ రెడ్డి పాండురంగారెడ్డి అంజయ్యలతోపాటు మరికొందరు నేతలు పాల్గొన్నారు.