వరంగల్ కలెక్టర్ హైదరాబాద్ లో హల్ చల్ మారథాన్ రన్ లో పాల్గొని షాక్ ఇచ్చిన ఆమ్రపాలి ఆమ్రపాలి ఏది చేసినా సంచనలమే అంటున్న జనాలు

యువ ఐఎఎస్ అధికారిణి ఆమ్రపాలి ఏది చేసినా సంచనలమే. సంచలనాలకు ఆమె కేరాఫ్ అడ్రస్. ఆమె ఇటీవల ఫారెస్టులో తిరిగి హల్ చల్ చేశారు. ఆమెతోపాటు మరో యువ కలెక్టర్ ప్రీతిమీనా తో కలిసి వరంగల్ అడవుల్లో నడిచారు ఇద్దరూ.

తాజాగా ఆమ్రపాలి హైదరాబాద్ లో సందడి చేశారు. ఆదివారం జరిగిన హైదరాబాద్ మారథాన్ 2017 లో పాల్గొని అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు ఆమ్రపాలి. పక్కన పరుగులో పాల్గొన్న వారు ఆమ్రపాలిని చూసి షాక్ అయ్యారు. ఈమె నిజంగానే కలెక్టరా లేక మామూలు అమ్మాయేనా అని నివ్వెరపోయారు.

కలెక్టర్ గా కాకుండా సామాన్య యువతిగానే ఆమ్రపాలి ఈ మారథాన్ లో పాల్గొని హల్ చల్ చేశారు. కలెక్టర్లు ఇలా కూడా ఉంటారా అని కొందరు రన్ లో పాల్గొన్న వారు చర్చించుకుంటున్నారు.