Asianet News TeluguAsianet News Telugu

ఓటమి భయంతోనే ముందస్తు ఎన్నికలకు కేసీఆర్ : అమిత్ షా

కాంగ్రెస్,టీఆర్ఎస్ పార్టీలపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నిప్పులు చెరిగారు. మహబూబ్ నగర్ జిల్లాలో ఎన్నికల శంఖారావంలో పాల్గొన్న అమిత్ షా ఎన్నికల శంఖారావం పూరించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ చీఫ్ కేసీఆర్ పై ధ్వజమెత్తారు. కేసీఆర్ ఓటమి భయంతోనే ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నారని ఆరోపించారు. ఒకే దేశం ఒకే ఎన్నికలతో దేశం మెుత్తం ఒకేసారి ఎన్నికలు నిర్వహించి ఖర్చు తగ్గిద్దామని చూస్తే కేసీఆర్ ముందస్తుకు వెళ్తున్నారని మండిపడ్డారు. జమిలీ ఎన్నికలపై కేసీఆర్ మాట తప్పారని ఆరోపించారు.

amith sha on trs congress
Author
Mahabubnagar, First Published Sep 15, 2018, 6:07 PM IST

మహబూబ్ నగర్:  కాంగ్రెస్,టీఆర్ఎస్ పార్టీలపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నిప్పులు చెరిగారు. మహబూబ్ నగర్ జిల్లాలో ఎన్నికల శంఖారావంలో పాల్గొన్న అమిత్ షా ఎన్నికల శంఖారావం పూరించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ చీఫ్ కేసీఆర్ పై ధ్వజమెత్తారు. కేసీఆర్ ఓటమి భయంతోనే ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నారని ఆరోపించారు. ఒకే దేశం ఒకే ఎన్నికలతో దేశం మెుత్తం ఒకేసారి ఎన్నికలు నిర్వహించి ఖర్చు తగ్గిద్దామని చూస్తే కేసీఆర్ ముందస్తుకు వెళ్తున్నారని మండిపడ్డారు. జమిలీ ఎన్నికలపై కేసీఆర్ మాట తప్పారని ఆరోపించారు.

మరోవైపు దళితుడిని సీఎం చేస్తానన్న కేసీఆర్‌ మాట తప్పారని ఆయన ఆరోపించారు. కేసీఆర్‌ తెలంగాణ దళితులకు ద్రోహం చేశారని, కనీసం ఇప్పటికైనా దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తారా లేదా అంటూ నిలదీశారు. తెలంగాణలో దళితులపై అఘాయిత్యాలు పెరిగాయని, దళితులంతా రగిలిపోతున్నారని అమిత్‌షా అన్నారు.

ఒకవైపు ఎంఐఎంతో సంబంధం లేదని చెప్తున్న టీఆర్ఎస్ పార్టీ నేతలు పొద్దుపోతే ఎంఐఎంతో కలిసి డ్యూయెట్లు పాడుతారని ఘాటుగా విమర్శించారు. లోక్‌సభతోపాటు ఎన్నికలకు వెళ్తే ఓడిపోతామన్న భయం కేసీఆర్ కు పట్టుకుందన్నారు. మే నెలలో గెలవలేని కేసీఆర్‌ డిసెంబర్‌లో ఎలా గెలుస్తారని ప్రశ్నించారు. 

ముందస్తుకు ఎందుకు వెళ్లారో కేసీఆర్‌ చెప్పాలని డిమాండ్ చేశారు. ఎంఐఎంకు భయపడి సెప్టెంబర్‌ 17 విమోచన దినం జరపడం లేదని అమిత్ షా ఆరోపించారు. ఎంఐఎంను చూసి టీఆర్‌ఎస్‌ ఎందుకు భయపడుతోందని ప్రశ్నించారు. బీజేపీ అధికారంలోకి వస్తే విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహిస్తాం అని అమిత్‌షా హామీ ఇచ్చారు. 
 
మరోవైపు జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఈ మధ్య పగటికలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. రాహుల్‌ ఎక్కడికి వెళ్తే అక్కడ గెలుస్తామంటున్నారని, తెలంగాణలోనూ  అదే మాట అన్నారని గుర్తుచేశారు. దేశమంతా కాంగ్రెస్‌ తుడిచిపెట్టుకుపోతోందని అమిత్‌షా జోస్యం చెప్పారు. 2014 తర్వాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమిపాలైందని ఆ విషయాన్ని రాహుల్ గాంధీ గుర్తుంచుకోవాలని హితవు పలికారు. 

బీజేపీ అధికారంలోకి వస్తే తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు ఉండవని తెలిపారు. రైతుల రుణమాఫీ చేసి వారిని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు తమ శత్రువులని ఆ పార్టీలను ఓడించడమే తమ లక్ష్మన్నారు. మరోవైపు మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్లు ఇస్తామని కేసీఆర్ చెప్తున్నారని 12 శాతం రిజర్వేషన్ వల్ల బీసీ, ఎస్సీ,ఎస్టీ, ఓబీసీలు తీవ్రంగా నష్టపోతారని అమిత్ షా స్పష్టం చేశారు.  

 

Follow Us:
Download App:
  • android
  • ios