హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా హైద్రాబాద్ కు వచ్చిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆదివారంనాడు అర్ధాంతరంగా రోడ్ షో ను ముగించారు. 

ఇవాళ ఉదయం బేగంపేట విమానాశ్రయం నుండి అమిత్ షా నేరుగా పాతబస్తీలోని భాగ్యలక్ష్మి ఆలయానికి చేరుకొన్నారు. ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అమిత్ షా వారాసీగూడ నుండి రోడ్ షోను ప్రారంభించారు. వారాసీగూడ నుండి సీతాఫల్ మండి వరకు రోడ్ షో  నిర్వహించాల్సి ఉంది. అయితే అమిత్ షా రోడ్ షో కు భారీగా  కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకొన్నారు. రోడ్ షో  కొనసాగించడం కష్టంగా మారింది. భారీగా పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఉండడంతో అమిత్ షా పాల్గొన్న వాహనం ముందుకు కదలడానికి చాలా సమయం పట్టింది. 

also read:అమిత్ షాకి నిరసన సెగ: రోడ్‌షోలో బీఎస్ఎన్‌ఎల్ ఉద్యోగుల ప్లకార్డుల ప్రదర్శన

వారాసీగూడ నుండి సీతాఫల్ మండి వరకు అమిత్ షా రోడ్ షో కొనసాగించాల్సి ఉండగా నామాలగుండు వద్ద రోడ్ షోను అమిత్ షా ముగించారు. రోడ్ షో ను నామాల గుండులో ముగించి కారులో బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకొన్నారు. అమిత్ షా రోడ్ షో లో పాల్గొన్న కార్యకర్తలు పెద్ద ఎత్తున ఓట్ ఫర్ బీజేపీ అంటూ నినాదాలు చేశారు. 

రోడ్ షో లో అమిత్ షా ప్రసంగించలేదు. రోడ్ షో లో ప్రజలకు అభివాదం చేస్తూ ఆయన ముందుకు కదిలారు. నామాలగుండు దగ్గర మధ్యలోనే రోడ్ షో ను అమిత్ షా ముగించారు నామాల గుండు నుండి అమిత్ షా బీజేపీ కార్యాలయానికి చేరుకొన్నారు.