Asianet News TeluguAsianet News Telugu

అమీన్ పూర్ గ్యాస్ సిలిండర్ పేలుడు నాలుగుకి చేరిన మృతుల సంఖ్య

సంగారెడ్డి జిల్లాలోని అమీన్ పూర్ లో గ్యాస్ సిలిండర్ పేలుడు ఘటనలో నలుగురు మృత్యువాతపడ్డారు. నాలుగు రోజుల క్రితం అమీన్ పూర్ లోని ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలుడు చోటు చేసుకొంది. ఈ ఘటనలో ఐదుగురు గాయపడ్డారు. గాయపడినవారు సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.

Ameenpur Gas Cylinder Blast Death Toll Rises To 4
Author
Hyderabad, First Published Aug 7, 2022, 4:35 PM IST

అమీన్ పూర్: Sanga Reddy  జిల్లాలోని అమీన్ పూర్ లో Gas Cylinder  పేలుడు ఘటనలో మృతుల సంఖ్య నాలుగుకి చేరింది. నాలుగు రోజుల క్రితం ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ పేలిన విషయం తెలిసిందే. 

 ఓ ఇంట్లో ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ప్రమాదం జరిగిన ఇంట్లో ఉన్న ఐదుగురికి గాయాలయ్యాయి. అయితే గ్యాస్ సిలిండర్ పేలుడుతో సాంబశివరావు, ప్రశాంతి, సుబ్రమణ్యంతో పాటు ఐదేఁళ్ల దివ్యశ్రీ, ఏడాది శ్యామాజీలు గాయపడ్డారు. గాయపడిన ఈ ఐదుగురిని సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో చేర్పించారు. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నలుగురు మరణించారు. సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రోజకొకరు చొప్పున  మరణించారు. 

ఈ సిలిండర్ బ్లాస్ట్  ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనలో గాయపడిన  ఐదుగురిలో నలుగురు మృతి చెందడం ఆ గ్రామంలో విషాదానికి కారణమైంది.

గతంలో కూడా ఇదే తరహా ఘటనలు రెండు తెలుగు రాష్ట్రాల్లో చోటు చేసుకొన్నాయి. ఈ ఏడాది సంగారెడ్డి జిల్లాలోని ఝరాసంగం మండలం మామిడిలోని ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలుడు చోటు చేసుకొంది. ఈ  ఘటన ఈ ఏడాది మే 21 వ తేదీన చోటు చేసుకొంది.ఈ సమయంలో  ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. 

2021  హైద్రాబాద్ పాతబస్తీలోని మీర్ చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలుడుతో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు.  గాయపడిన వారంతా పశ్చిమ బెంగాల్ కు చెందిన వారు. బెంగాల్ రాష్ట్రం నుండి వచ్చిన వీరంతా  హైద్రాాద్ లో స్వర్ణకారులుగా పనిచేస్తున్నారు. 

2021 నవంబర్ 23వ తేదీన హైద్రాబాద్ నానక్ రామ్ గూడలో గ్యాస్ సిలిండర్ పేలుడుతో ఒకరు మృతి చెందారు. మరో తొమ్మిది మంది గాయపడ్డారు. ఈ ఘటనలో భవనం పూర్తిగా దెబ్బతింది. 2021 ఆగష్టులో హైద్రాబాద్ దూల్ పేటలో కూడ గ్యాస్ సిలిండర్ ఘటన చోటు చేసుకొంది.  అక్రమంగా గ్యాస్ ఫిల్లింగ్  చేస్తున్న సమయంలో ఈ గ్యాస్ సిలిండర్ పేలుడు చోటు చేసుకొంది. 


 

Follow Us:
Download App:
  • android
  • ios