సిద్దిపేట: ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో ప్రమాదం చోటుచేసుకుంది. ప్రాణాలను కాపాడే ఓ అంబులెన్స్ ప్రజల ప్రాణాలను బలితీసుకున్నంత పని చేసింది. గజ్వేల్ మండలం జాలిగామ గ్రామంలో 104 వాహనం జనాలపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. 

ఈ ఘటనతో తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయిన గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించారు. ఈ క్రమంలోనే ప్రమాదానికి కారణమైన 104 వాహనంపై దాడి చేశారు. దీంతో పాక్షికంగా గ్రామస్తులు ధ్వంసం చేశారు. 

అంబులెన్స్ ఢీకొట్టడంతో గాయాలపాలైన వారిని స్థానికంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ఈ ఘటనతో జాలిగామలో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.