కేసీఆర్  పుట్టిన రోజు సమయంలో  వేడుకలు నిర్వహిస్తున్న సమయంలో  ప్రమాదంలో  అంబర్ పేట ఎమ్మెల్యే  కాలేరు వెంకటేష్  కి ప్రమాదం తృటిలో తప్పింది.  

హైదరాబాద్: అంబర్ పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్‌కి శుక్రవారం నాడు ప్రమాదం తప్పింది. కేసీఆర్ పుట్టిన రోజుు పురస్కరించుకొని బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఇవాళ కాచిగూడలో వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో అంబర్ పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో టపాసులు పేల్చే సమయంలో నిప్పు రవ్వలు గ్యాస్ బెలూన్లపై పడ్డాయి. దీంతో గ్యాస్ బెలూన్లు పేలాయి. గ్యాస్ బెలూన్లు పేలడంతో ఎమ్మెల్యే వెంకటేష్ సహ బీఆర్ఎస్ కార్యకర్తలు అక్కడి నుండి పరిగెత్తారు. ఈ సమయంలో వెంకటేష్ సహ కొందరు బీఆర్ఎస్ కార్యకర్తలు కిందపడ్డారు.ఈ ఘటనలో ఎమ్మెల్యే వెంకటేష్ కి స్వల్ప గాయాలయ్యాయి.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

గ్యాస్ బెలూన్లను ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ఎగురవేసే సమయంలో కార్యకర్తలు టపాసులు పేల్చారు. టపాసుల నుండి వెలువడిన నిప్పురవ్వలు గ్యాస్ బెలూన్లపై పడ్డాయి. దీంతో గ్యాస్ బెలూన్లు పేలాయి. గ్యాస్ బెలూన్లు పేలడంతో ఎమ్మెల్యే సహ బీఆర్ఎస్ కార్యకర్తలు పరుగెత్తారు. ఈ సమయంలో ఎమ్మెల్యే వెంకటేష్ కిందపడిపోయాడు. ఎమ్మెల్యేకి స్వల్ప గాయాలయ్యాయని బీఆర్ఎస్ కార్యకర్తలు చెబుతున్నారు.