హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ, సెక్రటేరియట్ భవనాల కూల్చివేత అంశం రాజకీయంగా రాజుకుంటోంది. ఇప్పటికే ఈ అంశంపై హైకోర్టులో విచారణ నడుస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా అఖిలపక్షం నేతలు గవర్నర్ నరసింహన్ కు ఫిర్యాదు చేశారు. 

తెలంగాణ అసెంబ్లీ, సెక్రటేరియట్ భవనాలను కూల్చొద్దంటూ కోరారు. రెండు భవనాలు చాలా సామర్థ్యం కలిగినవని వాటిని కూల్చడం వల్ల చారిత్రాత్మక కట్టడాలను కోల్పోతామని తెలిపారు. రాష్ట్రంలో అనేక సమస్యలు ఉండగా వాటిని పట్టించుకోకుండా సెక్రటేరియట్, అసెంబ్లీ భవనాల కూల్చివేతపైనే ఎందుకు శ్రద్ధపెట్టిందో అర్థం కావడం లేదని ప్రశ్నించారు.

ప్రస్తుతం ఉన్న సెక్రటేరియట్, అసెంబ్లీ భవనాలు చాలా బలంగా ఉన్నాయని తెలిపారు. 294 మంది ఎమ్మెల్యేలకు వీలు ఉండేలా అసెంబ్లీని నిర్మించారని అలాంటి భవనాలను కూల్చివేయాలనుకోవడం సరికాదని ఆ నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకునేలా చూడాలని గవర్ననర్ నరసింహన్ ను కోరారు.