Asianet News TeluguAsianet News Telugu

తీన్మార్ మల్లన విడుదల కోసం అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశం..

మల్లన్న హుజరాబాద్ ఎన్నికల్లో టిఆర్ఎస్ పంచుతున్న డబ్బులను ఎండగడతాడనే నెపంతో పాదయాత్ర చేయకుండా అడ్డుపడి అరెస్టు చేయించాడు. టిఆర్ఎస్ పార్టీ ఓటమి భయంతోనే కేసీఆర్ మల్లన్న పాదయాత్ర చేయకుండా అడ్డుపడి తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేయించారు. 

All party round table meeting for the release of Teenmar Mallana
Author
Hyderabad, First Published Sep 8, 2021, 3:39 PM IST

సోమాజిగూడ లో తీన్మార్ మల్లన్న విడుదలకై తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షులు డా. చెరుకు సుధాకర్ అధ్యక్షతన అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. 

*ఈ సమావేశానికి పలువురు రాజకీయ నేతలు హాజరయ్యారు. బిజెపి కోర్ కమిటీ సభ్యుడు వివేక్ వెంకటస్వామి, కాంగ్రెస్ మల్లురవి, జర్నలిస్ట్ యాదగిరి, తెలంగాణ ఇంటి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు చెరుకు సుధాకర్, మాజీ MLC దిలీప్ కుమార్, పల్లె రవి కుమార్, తీన్మార్ మల్లన్న అభిమానులు తదితరులు పాల్గొన్నారు. 

బీజేపీ కోర్ కమిటీ సభ్యుడు వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ.. *రాష్ట్రంలో రజాకార్ల పాలన జరుగుతుంది. కెసిఆర్ రాష్ట్రంలో ప్రజల గొంతు నొక్కేసి  చేస్తున్నాడు. కెసిఆర్ కు, కేటీఆర్ కు ఉద్యమకారులు చిల్లరగా కనిపిస్తున్నారు. రాష్ట్ర సర్కార్ మల్లన్నపై తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేయడం జరిగింది. 

మల్లన్న హుజరాబాద్ ఎన్నికల్లో టిఆర్ఎస్ పంచుతున్న డబ్బులను ఎండగడతాడనే నెపంతో పాదయాత్ర చేయకుండా అడ్డుపడి అరెస్టు చేయించాడు. టిఆర్ఎస్ పార్టీ ఓటమి భయంతోనే కేసీఆర్ మల్లన్న పాదయాత్ర చేయకుండా అడ్డుపడి తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేయించారు. 

పోలీసు వాళ్ళు క్యూ న్యూస్ ఎంప్లాయిస్ పై దుర్భాషలు మాట్లాడుతున్నారు. కెసిఆర్ ప్రశ్నించే గొంతులను నొక్కేసి  ప్రయత్నం చేస్తున్నాడు, ప్రజలు కేసీఆర్ పై యుద్ధం చేయాలి.  కెసిఆర్ చేస్తున్న అరాచకాలను అరికట్టడానికి అందరు కలిసి పని చేయాలి. తీన్మార్ మల్లన్న న్యూస్ వెనకాల ప్రజలు ఉన్నారని భరోసా ఇచ్చారు.

సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి మాట్లాడుతూ.. తెలంగాణలో భారత రాజ్యాంగం పట్ల చిత్తశుద్ధి లేదన్నారు.  తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షులు డా. చెరుకు సుధాకర్ మాట్లాడుతూ.. క్యూ న్యూస్ ఆఫీసులో కంప్యూటర్లు ఎత్తుకెళ్లి మల్లన్నను దోషిగా చేసే కుట్ర జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం కన్న 10 రెట్లు ఎక్కువ నియంత ధోరణిలో కెసిఆర్ ప్రభుత్వం సాగుతుంది. 

తెలంగాణలో ప్రశ్నించే హక్కును నిలబెట్టే ప్రయత్నం చేసిన. మల్లన్నను కేవలం జర్నలిస్ట్ గా చూడటం కూడా తగదు. మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కోట్లు పంచిన టీఆర్ఎస్ అభ్యర్థిపై నైతికంగా విజయం సాధించిన వ్యక్తి. మాట్లాడటమే తప్పు అయితే తలసాని, ఎర్రబెల్లి మాట్లాడే మాటలకు  బట్టలు ఊడదీసి కొట్టాలి. కెసిఆర్ కోపంగా చూస్తే మనం ఉరిమి చూడటం నేర్చుకోవాలి. 

చట్టం తన పని తను చేసుకుపోతే తప్పు లేదు. నాయకుల చిత్తం ప్రకారం చేస్తే చట్టం ప్రకారమే కొట్లాడుతాం. తెలంగాణలో నైజాం సర్కార్ నడుస్తుంది. అందుకే నాడు రఘు, నేడు మల్లన్నను కిడ్నాప్ చేసిన ప్రభుత్వం. అవినీతిని, భూ కబ్జాలు పై ప్రశ్నించడం తప్పేం కాదు. లెఫ్ట్ నుండి రైట్ వరకు అన్ని పార్టీలు మల్లన్న విడుదలకు కలిసి రావాలి.

తెలంగాణ ప్రజా ఫ్రంట్ రవిచందర్ మాట్లాడుతూ... టిఆర్ఎస్ ప్రభుత్వం తీన్మార్ మల్లన్న పై అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టే ప్రయత్నం చేస్తుంది. రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రశ్నించే గొంతులను అణిచివేయడానికి ప్రయత్నం చేస్తుంది. హుజరాబాద్ లో మల్లన్న పాదయాత్ర చేస్తే టీఆర్ఎస్ పుట్టగతులు ఉండవని తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేసి జైల్లో పెట్టింది. ప్రజల సమస్యలపై ప్రజల దగ్గరికి పోతున్న నేతలను టిఆర్ఎస్ సర్కార్ పోలీసులతో అడ్డుకోని పిస్తుంది. రాష్ట్రంలో మరోసారి తెలంగాణ ఉద్యమం జరగాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. 

కాంగ్రెస్ నేత మల్లు రవి మాట్లాడుతూ.. నడుస్తూ నడిపించే వాడే ప్రజానాయకుడు. తెలంగాణలో ప్రజలకు స్వేచ్ఛ లేకుండా తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఆర్టీసీలో యూనియన్ నశింపచేసి ఇప్పుడు ఆర్టీసీని తీసివేసే ప్రయత్నం చేస్తున్నారు. సకల జనుల సమ్మె చేస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. రాష్ట్రంలో అధికారం ప్రతిపక్షం, ప్రతిపక్షం అనేది రెండు వర్గాల వాళ్ళు ఉండాలి. రాజ్యాంగం ఇచ్చిన హక్కులను రాష్ట్రంలో తెలంగాణ సర్కార్ అణిచివేయడం జరుగుతుంది. ప్రజల తరుపున ఉన్న మల్లన్నను తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేశారు,మల్లన్న చేస్తున్న క్యూ న్యూస్ వార్తలు చూసే ప్రజల్లో చైతన్యం వస్తుంది. 

తీన్మార్ మల్లన్న అటువంటి వాళ్ళకు అన్యాయం జరగదని రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. గతంలో కోదండరామును అరెస్టు చేశారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలను నిరసనలు ధర్నాలు చేసే స్వేచ్ఛ ఇవ్వడం లేదు, ప్రజల సమస్యలు పై  అధికార పార్టీ నేతలు పార్లమెంట్ లో మాట్లాడటం లేదు. ఉద్యోగాలు లేక రాష్ట్రంలో నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు తెలంగాణలో పరిపాలన సక్రమంగా జరగకపోవడం దీనికి ప్రధాన కారణం. 

ప్రజల కోసం గొంతు ఎత్తి  వాళ్లను  తెలంగాణ సర్కార్ అక్రమంగా అరెస్టు చేపిస్తోంది.  రాష్ట్రంలో నియంత్రణ పరిపాలన అడ్డుకట్ట వేయాలని మల్లన్న జైల నుండి విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 

తీన్మార్ మల్లన్న భార్య మాట్లాడుతూ.. మా ఇంటికి వందలాది మంది పోలీసులు భయాందోళనకు గురిచేస్తున్నారు. మల్లన్నను అరెస్టు చేయడమే కాదు మెంటల్ గా మా కుటుంబానికి టార్చర్ పెడుతున్నారు.  ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను మల్లన్న ప్రజలకు చెప్పడం తప్పా. మల్లన్న అభిమానులు మల్లన్న వెనకాల ఉండాలని కోరారు.

Follow Us:
Download App:
  • android
  • ios