జగిత్యాల: అలిశెట్టి కవిత్వం అజరామరమైనదని, చిన్న కవితలలో గొప్ప భావాన్ని వ్యక్తీకరించారని జగిత్యాల శాసనసభ్యులు సంజయ్ కుమార్ అన్నారు. శనివారం జగిత్యాల పెన్షనర్స్ భవన్ లో కళా శ్రీ ఆర్ట్ థియేటర్స్ గుండేటి రాజు,  రేగొండ నరేష్, అలిశెట్టి రాజు ఆధ్వర్యంలో నిర్వహించిన అలిశెట్టి ప్రభాకర్ స్మారక రాష్ట్రస్థాయి పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 

ప్రభాకర్ జగిత్యాల వాసి అయినందుకు గర్వంగా ఉందని సంజయ్ కుమార్ అన్నారు ముఖ్యమంత్రి సాహిత్యాభిమాని కావడం వల్ల, తెలంగాణ ఏర్పాటు కావడం వల్ల అలిశెట్టి కి గొప్ప గౌరవం లభించిందని అన్నారు. అలిశెట్టి కవిత పదవ తరగతి పాఠ్యపుస్తకాలలో చోటు చేసుకోవడం ద్వారా భవిష్యత్ తరాలు అలిశెట్టి గురించి తెలుసుకునే అవకాశం కలిగిందని అన్నారు. సమాజంలోని అసమానతలను అలిశెట్టి తన కవితలలో నిరసించారని అన్నారు. 

దురదృష్టవశాత్తు చిన్న వయసులోనే పరమపదించారని, ఆయన పుట్టిన రోజు మరణించిన రోజు ఒకే రోజు అవడం యాదృచ్చిక మని ఎమ్మెల్యే అన్నారు.
తొలుత అలిశెట్టి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. 


కార్యక్రమానికి గౌరవ అతిథిగా విచ్చేసిన అడిషనల్ ఎస్.పి. మురళీధర్ మాట్లాడుతూ... రాజు మరణించి ఒక తార రాలిపోయే అని జాషువా కవితను ఉదహరించి, మంచి కవులు ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోతారని, అలాంటి వారిలో అలిశెట్టి ప్రభాకర్ ఒకరు తెలిపారు. 

ఈ సందర్భంగా అలిశెట్టి ప్రభాకర్ మారక స్మారక రాష్ట్రస్థాయి పురస్కారాన్ని కవయిత్రి రచయిత్రి అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జ్యోత్స్న ప్రభ కు ప్రదానం చేశారు . అలాగే మహిళా సాహిత్య పురస్కారాలను  కవయిత్రులు చిందం సునీత,  దాసరి శాంత కుమారి , కొలిపాక శోభారాణి , చీకట్ల సంగీత లకు లకు ప్రధానం చేశారు.


ఈ కార్యక్రమానికి మాడిశెట్టి గోపాల్ వ్యాఖ్యాతగా వ్యవహరించగా, అతిథులుగా డి ఎస్ పి ప్రతాప్, పెద్ది ఆనందం, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు టీవి సూర్యం , సిరిసిల్ల శ్రీనివాస్,  స్వాతంత్ర్య సమరయోధులు రాఘవేంద్రరావు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ భూసార పు శ్రీనివాస్ గౌడ్,  ఎల్లాల రాజేందర్ రెడ్డి,  గాజుల రాజేందర్,  బండ శంకర్, డా. రాజగోపాలాచారి, అలిశెట్టి ఈశ్వరయ్య ఎల్ల గంగారాం,  తదితరులు పాల్గొన్నారు.