ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత కు పెను ప్రమాదం తప్పింది. ఆమెపై భనవం పెచ్చులు ఊడిపడ్డాయి. పూర్తి వివరాల్లోకి వెళితే..  ఆలేరులోని పీఆర్ గెస్ట్ హౌజ్ లో సీఎం రిలీఫ్ ఫండ్స్ చెక్కుల పంపిణీ కోసం గురువారం  ఎమ్మెల్యే  సునీత అక్కడికి వచ్చారు. అదే సమయంలో బిల్డింగ్ స్లాబ్ పెచ్చులు ఊడి ఆమెపై పడ్డాయి. 

ఈ ఘటనలో మోరిగాడి ఇందిర అనే కార్యకర్త తలకు తీవ్ర గాయాలయ్యాయి. పక్కనే ఉన్న ఎమ్మెల్యే సునీత కు చేతికి గాయమైంది. కాగా... ఇద్దరినీ అధికారులు చికిత్స నిమిత్తం ఆలేరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.