తెలంగాణ ఎన్నికల్లో రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. గతంలో సునాయాసంగా గెలుస్తుందనుకున్న టీఆర్ఎస్ పార్టీకి మహాకూటమి పేరుతో ప్రత్యర్థి ప్రతిపక్ష కూటమి గట్టి పోటీస్తోంది. ఇక మంగళవారం లగడపాటి బైటపెట్టిన సర్వే వివరాలాలతో ఒక్కసారిగా టీఆర్ఎస్ లో అలజడి...అదే సమయంలో కాంగ్రెస్ ఆనందపూరిత వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో టీఆర్ఎస్ పార్టీకి మద్దతిస్తున్న ఎంఐంఎం పార్టీ అధ్యక్షులు అసదుద్దిన్ ఓవైసి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

ఒకవేళ ప్రజాకూటమి అధికారంలోకి వస్తే ఆ ప్రభుత్వానికి మద్దతిస్తారా అన్న ప్రశ్న కు అసదుద్దిన్ సమాధానమిస్తూ....ఆ  అంశంపై ఇప్పుడే ఏం చెప్పలేమంటూ దాటవేశారు. దీంతో ఆ దిశగా కూడా ఎంఐఎం పార్టీ పావులు కదుపుతుందా అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. 

అయితే టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో కూడా తాము చేరబోమరని అసదుద్దిస్ వెల్లడించారు. టీఆర్ఎస్ సంమపూర్ణ మెజారిటీతో గెలుస్తుందన్న నమ్మకం ఉందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. బిజెపి, కాంగ్రెస్ పార్టీలు కావాలనే ఎంఐఎం కొన్ని పార్టీలకు ఎ టీమ్, బి టీమ్ అంటూ అసత్య ప్రచారం చేస్తుందని...తాము ఎవరి టీమ్ కాదని అసదుద్దిన్ స్పష్టం చేశారు.