Asianet News TeluguAsianet News Telugu

కేటీఆర్‌‌పై ఒవైసీ ట్వీట్: మంత్రిగా చూడాలని వుందంటూ వ్యాఖ్యలు

తెలంగాణలో అధికార టీఆర్ఎస్‌కు మిత్ర పక్షంగా వ్యవహరిస్తున్న ఎంఐఎం.. వీలుచిక్కినప్పుడల్లా కేసీఆర్ అండ్ ఫ్యామిలీని ఆకాశానికెత్తేస్తున్నారు. తాజాగా ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ.. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

AIMIM Chief asaduddin owaisi praises ktr
Author
Hyderabad, First Published Aug 26, 2019, 7:43 PM IST

తెలంగాణలో అధికార టీఆర్ఎస్‌కు మిత్ర పక్షంగా వ్యవహరిస్తున్న ఎంఐఎం.. వీలుచిక్కినప్పుడల్లా కేసీఆర్ అండ్ ఫ్యామిలీని ఆకాశానికెత్తేస్తున్నారు. తాజాగా ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ.. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఆయనను త్వరలో ప్రభుత్వంలో చూడాలని వుందన్న ఒవైసీ.. కేటీఆర్ మంత్రి కావాలని చెప్పకనే చెప్పారు. దిగ్గజ మొబైల్ సంస్థ వన్‌ప్లస్ సోమవారం హైదరాబాద్‌లో ఆర్‌&డీ ని ప్రారంభించిన సందర్భంగా ఒవైసీ ఈ వ్యాఖ్యలు చేశారు.

గతేడాది  ఒప్పో... మొన్న అమెజాన్.. తాజాగా వన్‌ప్లస్ కేంద్రాలు హైదరాబాద్‌ను అంతర్జాతీయ స్థాయిలో నిలబెడుతున్నాయన్నారు. ఈ క్రెడిట్ అంతా మాజీ మంత్రి కేటీఆర్‌కే దక్కుతుందని ప్రశంసలు జల్లు కురిపించారు. అసుదుద్దీన్‌ ట్వీట్‌పై స్పందించిన కేటీఆర్ రీట్వీట్ చేసి ధన్యవాదాలు తెలిపారు.

త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రివర్గ విస్తరణ చేపట్టనున్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఒవైసీ ట్వీట్ రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారి తీసింది. 

Credit must be given to “ex minister”@KTRTRS ,waiting to see him back in governance https://t.co/ukbi46UIXj

Follow Us:
Download App:
  • android
  • ios