ఎయిడ్స్ వ్యాధి ప్రాణాంతకం అని తెలుసు. అది లైంగికంగా సంక్రమిస్తుంది అని కూడా తెలుసు... అన్నీ తెలిసి కూడా ఓ ఎయిడ్స్ రోగి.. దారుణానికి పాల్పడ్డాడు. తనకు హెచ్ఐవీ ఉందని తెలిసీ..  ఏడేళ్ల చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అందులోనూ బాలిక జ్వరంతో బాధపడుతున్న సమయంలో.. బాలికపై తన కామ వాంఛ తీర్చుకున్నాడు. ఈ సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా  అశ్వారావుపేట పట్ణంలో సోమవారం చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట పట్టణానికి చెందిన ఓ మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి ఒంటరిగా జీవిస్తోంది. ఆమె ఇటీవల భర్తను కోల్పోగా... ఇద్దరు పిల్లను పోషించుకుంటూ జీవిస్తోంది. కాగా... వారి ఇంటికి సమీపంలోనే ఓ యువకుడు నివసిస్తున్నాడు. ఆ యువకుడికి తల్లిదండ్రులు లేకపోగా... గత కొంతకాలం నుంచి ఎయిడ్స్ వ్యాధితో బాధపడుతున్నాడు.

ఓ లారీ క్లీనర్ గా పనిచేస్తూ.. జీవనం సాగిస్తున్నాడు. కాగా.. తరచూ ఆ మహిళ ఇంటికి వచ్చి.. టీవీ చూస్తూ ఉండేవాడు.  కాగా... మహిళకు ఇద్దరు పిల్లలు కాగా... వారిలో ఓ బాలికకు సోమవారం బాగా జ్వరం వచ్చింది. దీంతో... ఆమె కూతురికి మందులు వేసి ఇంట్లో నిద్రపుచ్చింది. అనంతరం ఆమె పొలం పనికి వెళ్లింది.

అదే సమయంలో టీవీ చూడటం కోసం వాళ్ల ఇంటికి వచ్చిన యువకుడికి దురాశ పట్టుకొచ్చింది. ఇంట్లో ఎవరూ లేని సమయాన్ని గుర్తించి.. జ్వరంతో బాధపడుతున్న బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అదే సమయంలో సదరు మహిళ ఇంటికి రాగా.. తన కూతురిపై యువకుడు లైంగిక దాడికి పాల్పడటాన్ని ఆమె గుర్తించింది. వెంటనే గట్టిగా కేకలు వేయడంతో యువకుడు పరారయ్యాడు.

వెంటనే ఆమె తన బాలికను తీసుకొని ఆస్పత్రికి తీసుకువెళ్లగా... బాలికపై అత్యాచారం జరిగినట్లు వైద్యులు గుర్తించారు. అనంతరం ఆమె వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడిపై పోస్కో చట్టం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, లైంగిక దాడి కింద కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.