ఢిల్లీకి రావాలని కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను రావాలని ఎఐసీసీ కోరింది.  రేవంత్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్కలు ఇప్పటికే ఢీల్లీలో ఉన్నారు. ఢిల్లీ నుండే భట్టి విక్రమార్క కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఫోన్ చేసి ఢిల్లీకి రావాలని కోరారు.

న్యూఢిల్లీ: Delhi కి రావాలని Congress పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులకు AICC పిలుపునిచ్చింది. Telanganaకు చెందిన MLA, MLC లు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఇప్పటికే తెలంాణ పీసీసీ చీఫ్ Revanth Reddy, సీఎల్పీ నేత Mallu Bhatti Vikramarka లు ఢిల్లీలోనే ఉన్నారు. ఎఐసీసీ పిలుపు నేపథ్యంలో తెలంగాణకు చెందిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఫోన్ చేశారు. రేపు కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులంతా ఢీల్లీకి వెళ్లనున్నారు. సోనియాగాంధీ సోమవారం నాడు సాయంత్రం డిశ్చార్జ్ అయ్యారు. ఈ నెల 23న Sonia Gandhi ఈడీ విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాలకు చెందిన ప్రజా ప్రతినిధులను ఢిల్లీకి రావాలని కాంగ్రెస్ పార్టీ ఆహ్వానం పంపింది. 

నేషనల్ హెరాల్డ్ కేసులో Rahul Gandhi , సోనియా గాంధీలను ఈడీ విచారణకు రావాలని నోటీసులు జారీ చేసింది. రాహుల్ గాంధీ సోమవారం నాడు కూడా ఈడీ విచారణకు హాజరయ్యారు. సోనియాగాంధీ కూడా విచారణకు హాజరు కానున్నారు.

నేషనల్ హెరాల్డ్ కేసులో గత వారంలో రాహుల్ గాంధీని మూడు రోజుల పాటు మొత్తం 30 గంటలపాటు విచారించింది. రాహుల్ వినతి మేరకు ఇవాళ ఆయనను విచారించింది ఈడీ. రేపు కూడా రాహుల్ ను విచారణకు రావాలని పిలిచే అవకాశం ఉందనే ప్రచారం కూడా సాగుతుంది. ఇవాళ రాష్ట్రపతిని కలిశారు కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు. రాహుల్ గాంధీ ఈడీ విచారణ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. 

గత మూడు రోజులుగా ఈడీ ఎదుట విచారణకు హాజరైన రాహుల్ గాంధీకి సంఘీభావంగా కాంగ్రెస్ అగ్రనేతలు, కార్యకర్తలు నిరసనలు చేస్తున్నారు. వారిలో పలువురిని కూడా అదుపులోకి తీసుకున్నారు.

ఢిల్లీలోని అక్బర్‌ రోడ్డులోని కాంగ్రెస్‌ ప్రధాన కార్యాలయంలోకి ఢిల్లీ పోలీసు సిబ్బంది ప్రవేశించి పార్టీ కార్యకర్తలను కొట్టారని కాంగ్రెస్‌ గత బుధవారం ఆరోపించడంతో నిరసనలు ఉద్రిక్తంగా మారాయి. పార్టీ పిలుపు మేరకు గురువారం కాంగ్రెస్ కార్యకర్తలు దేశవ్యాప్తంగా అన్ని రాజ్‌భవన్‌లలో ఘెరావ్‌ నిర్వహించారు.

గత మంగళవారం నాడు కాంగ్రెస్ ఎంపీలు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ ఛైర్మన్ ఎం. వెంకయ్య నాయుడుతో సమావేశమై దేశ రాజధానిలో తమ నిరసనల సందర్భంగా కొంతమంది మహిళలతో సహా పార్టీ చట్టసభ సభ్యులపై ఢిల్లీ పోలీసులు దాడి చేసిన విషయమై ఫిర్యాదు చేశారు.