Asianet News TeluguAsianet News Telugu

ఢిల్లీ లిక్కర్ స్కాం: లంచ్ తర్వాత కవిత నుండి స్టేట్ మెంట్ రికార్డు చేస్తున్న సీబీఐ


ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీబీఐ అధికారులు  ఎమ్మెల్సీ కవితను నాలుగు గంటల నుండి సమాచారాన్ని సేకరిస్తున్నారు.ఈ కేసులో  లంచ్ బ్రేక్ కోసం కొద్దిసేపు  సమాచార సేకరణకు విరామం ఇచ్చారు.  
 

After Lunch  CBI officers gathering information from  MLC Kavitha in Delhi liquor Scam
Author
First Published Dec 11, 2022, 3:48 PM IST

హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్ స్కాం విషయమై  బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత  నుండి  సీబీఐ అధికారులు ఆదివారంనాడు సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఇవాళ ఉదయం  11 గంటల నుండి కవితను సీబీఐ అధికారులు ఈ విషయమై సమాచారం సేకరిస్తున్నారు.   ఇవాళ మధ్యాహ్నం 01:30 గంటలకు సీబీఐ అధికారులు భోజనం కోసం  విరామం ఇచ్చారు.  భోజనం పూర్తి చేసిన  తర్వాత  మళ్లీ విచారణను సీబీఐ అధికారులు ప్రారంభించారు. రెండు వాహనాల్లో ఆరుగురు అధికారుల బృందం కవిత ఇంటికి ఇవాళ వచ్చింది. సీబీఐ డీఐజీ  రాఘవేంద్ర వత్స  నేతృత్వంలో బృందం  కవిత నుండి సమాచారం సేకరిస్తున్నారు.ఈ బృందంలో  ఒక మహిళా అధికారి కూడా  ఉన్నారు.

కవిత  నుండి సమాచారం సేకరించేందుకు గాను  సీబీఐ అధికారులు రావడానికి అరగంట ముందే  న్యాయవాదులు  కవిత ఇంటికి వచ్చారు. సీబీఐ అధికారులు కవిత న్యాయవాది సమక్షంలో ఈ విషయమై సమాచారాన్ని సేకరిస్తున్నారని సమాచారం. ఢిల్లీ లిక్కర్ స్కాంలో   ఈడీ అధికారులు అరెస్ట్  చేసిన అమిత్ ఆరోరా రిమాండ్ రిపోర్టులో  కవిత  పేరు ఉంది. అమిత్ ఆరోరా  రిమాండ్ రిపోర్టు  వెలుగు చూసిన మరునాడే  కవితకు సీబీఐ అధికారులు  నోటీసులు జారీ చేశారు.  160 సీఆర్‌పీసీ సెక్షన్ కింద నోటీసులిచ్చారు.ఈ నోటీసులకు ఈ నెల 6వ తేదీన  తాను  సిద్దంగా ఉంటానని కవిత  తొలుత సమాచారం ఇచ్చారు.

also read:ఛాయ్ , బిస్కట్ల కోసం సీబీఐ రాలేదు: కవిత నుండి సీబీఐ సమాచార సేకరణపై బండి సంజయ్

ఈ నెల 3వ తేదీన ఉదయం ప్రగతి భవన్ లో  కేసీఆర్ ,కవితలు న్యాయ నిపుణులతో ఈ విషయమై చర్చించారు.  ఈ చర్చలు ముగిసిన తర్వాత  సీబీఐకి  కవిత లేఖ రాసింది. ఈ కేసుకు సంబంధించి  చార్జీషీట్, ఎఫ్ఐఆర్‌ను పంపాలని కవిత లేఖ రాసింది. ఈ లేఖలకు సంబంధించి సీబీఐ కవితకు సమాచారం పంపింది. అయితే ఎఫ్ఐఆర్, చార్జీషీట్లలో తన పేరు లేదని కవిత పేర్కొన్నారు. అంతేకాదు  ఈ విషయమై  సీబీఐకి సహకరిస్తానని కవిత  స్పష్టం చేశారు.ఈ నెల 11,12, 14, 15 తేదీల్లో  తాను హైద్రాబాద్ లో ఉంటానని  సీబీఐకి సమాచారం పంపారు.  ఈ సమాచారంపై సీబీఐ అధికారులు ఈ నెల 6వ తేదీన స్పందించారు. ఈ నెల  11న సమాచార సేకరణకు వస్తామని కవితకు  సీబీఐ అధికారులు మెయిల్ ద్వారా సమాచారం పంపారు. ఈ కేసులో సమాచార సేకరణలో భాగంగా  కవిత  ఇంటికి ఇవాళ సీబీఐ అధికారుల బృందం  వచ్చింది.  
 

Follow Us:
Download App:
  • android
  • ios