ఉమ్మడి ఆదిలాబాద్  జిల్లా గుడిహత్నూర్ మండలం గర్కంపేటలో  మృతదేహలు కలకలం రేపుతున్నాయి.   

ఆదిలాబాద్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం గర్కంపేటలో రెండు మృతదేహలు కలకలం సృష్టించాయి. . ఎక్కడో హత్య చేసి మృతదేహలను ఇక్కడ తీసుకొచ్చారనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. సంఘటన స్థలాన్ని ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి పరిశీలించారు.. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

మృతులను ఆదిలాబాద్ కు చెందిన ఆశ్విని, రెహమాన్ గా గుర్తించారు. రెండు మృతదేహలపై తలలపై గాయాలను పోలీసులు గుర్తించారు. ఈ హత్యలు రెండు రోజుల క్రితం జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

 ఆశ్వనికి వివాహమైంది. వీరిద్దరి హత్యకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. వీరిద్దరి మధ్య వివాహేతర సంబంధం కారణమా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. రెహమాన్ ఈ నెల 28వ తేదీ నుండి కన్పించడం లేదని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ ఇవాళ రెహమాన్ మృతదేహం లభ్యమైంది. వీరిద్దరిని ఎవరు హత్య చేశారనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆశ్వని, రెహమాన్ లను హత్య చేయడానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.