Asianet News TeluguAsianet News Telugu

ఎలాగైనా వైశాలిని పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను.. నవీన్ రెడ్డి కన్‌ఫెషన్‌ స్టేట్‌మెంట్‌లో కీలక అంశాలు..!

హైదరాబాద్ శివార్లలో బీడీఎస్ విద్యార్థిని వైశాలి కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితుడు నవీన్ రెడ్డి‌‌తో పాటు మరో ఐదుగురు నిందితులకు ఇబ్రహీంపట్నం కోర్టు 14 రోజుల జ్యూడీషియల్ రిమాండ్ విధించింది. 

adibatla kidnap case Naveen Reddy and 5 others remanded to judicial custody
Author
First Published Dec 15, 2022, 9:46 AM IST

హైదరాబాద్ శివార్లలో బీడీఎస్ విద్యార్థిని వైశాలి కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితుడు నవీన్ రెడ్డి‌‌తో పాటు మరో ఐదుగురు నిందితులకు ఇబ్రహీంపట్నం కోర్టు 14 రోజుల జ్యూడీషియల్ రిమాండ్ విధించింది. మంగళవారం గోవాలో నవీన్ రెడ్డిని రాచకొండ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అనంతరం అతడిన హైదరాబాద్‌కు తరలించారు. అతని సహచరులు కొందరిని హైదరాబాద్ శివార్లలోని వివిధ ప్రాంతాల నుంచి అదుపులోకి తీసుకున్నారు. వైద్య పరీక్షల అనంతరం నవీన్ రెడ్డిని, అతని ఐదుగురు సహచరులను ఇబ్రహీంపట్నం కోర్టు ముందు హాజరుపరచగా.. కోర్టు జ్యూడీషియల్ రిమాండ్ విధించింది. దీంతో నవీన్ రెడ్డిని, అతని సహచరులను పోలీసలు చర్లపల్లి సెంట్రల్ జైలుకు తరలించారు. ఈ కేసులో ఇప్పటివరకు 38 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. అయితే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నవీన్ రెడ్డి సన్నిహితులు రుమెన్, పవన్ ఇప్పటికీ పరారీలో ఉన్నారు. 

ఇదిలా ఉంటే ఇబ్రహీం పట్నం కోర్టు నుంచి చర్లపల్లి జైలుకు తరలించే క్రమంలో నవీన్ రెడ్డి మీడియాతో మాట్లాడే ప్రయత్నం చేశారు. .తాను సేఫ్‌గా లేనని.. గంట నిడివి ఉన్న వీడియో విడుదల చేస్తే.. పోలీసులు మీడియాకు చేరకుండా అడ్డుకున్నారని చెప్పారు. అదే సమయంలో పోలీసులు నవీన్ రెడ్డిని అక్కడి నుంచి తీసుకెళ్లిపోయారు. 

ఇదిలా ఉంటే.. నవీన్ రెడ్డి కన్‌ఫెషన్ స్టేట్‌మెంట్‌‌లో కీలక అంశాలు వెల్లడించినట్టుగా తెలుస్తోంది. ‘‘బ్యాడ్మింటన్ ఆడేటప్పుడు వైశాలి నాకు పరిచయమైంది. నేను  ప్రేమిస్తున్నట్టుగా వైశాలికి చెప్పాను. వైశాలి నా ప్రేమను నిరాకరించింది. వైశాలి తండ్రి దగ్గరికి ప్రేమ పెళ్లి ప్రపోజల్ తీసుకెళ్లాను. అయితే ఆమె కుటుంబ సభ్యులు నా ప్రపోజల్‌ను ఒప్పుకోలేదు. వైశాలిని ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను. అందుకే వైశాలిని వేధించడం మొదలుపెట్టాను. నకిలీ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌తో ఫొటోలు, వీడియోలు పెట్టాను. 

వైశాలి ఇంటి ముందే ల్యాండ్ తీసుకుని షెడ్ వేసుకున్నాను. వైశాలికి నిశ్చితార్థం జరుగుతుందని తెలిసి.. నా దగ్గర పనిచేస్తున్న వారిని తీసుకుని ఆమె ఇంటికి వెళ్లాను. వారు ఆవేశంతో వైశాలి ఇంట్లో వారిపై దాడి చేసి ఫర్నీచర్ ధ్వంసం చేశారు. వైశాలిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లాను. కారులో వైశాలిని చిత్రహింసలకు గురిచేశాను. పోలీసులు నా కోసం గాలిస్తున్నారని తెలిసి భయపడ్డాను. వైశాలిని క్షేమంగా వాళ్ల ఇంటి సమీపంలో వదిలిపెట్టి వెళ్లిపోయాం. మూడు రోజులుగా వివిధ మార్గాల ద్వారా గోవాకు చేరుకున్నాం. వైశాలి అంటే నాకు చాలా ఇష్టం. వైశాలిని నేను ఏం చేయాలని అనుకోలేదు. అందుకే వైశాలిని క్షేమంగా ఇంటికి పంపించాను’’ నవీన్ రెడ్డి  చెప్పినట్టుగా సమాచారం. 

ఇక, డిసెంబరు 9న మన్నెగూడలోని వైశాలి ఇంటిపై దాడి చేసిన నవీన్ రెడ్డి, అతని అనుచరులు వీరంగం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వైశాలిని అపహరించిన తర్వాత నవీన్ రెడ్డి, అతని సహచరులు సాయి నాథ్, సిద్ధు, వాజిద్ ఆమెను ఎస్‌యూవీలో సాగర్ రోడ్డులోని నల్గొండ వైపు తీసుకెళ్లారు. పోలీసులు తమ కోసం గాలిస్తున్నారని తెలుసుకున్న నవీన్..  వారివద్ద ఉన్న సెల్ ఫోన్లన్నీ ఆఫ్ చేశారు. కాసేపటి తర్వాత నవీన్‌ వైశాలిని మన్నెగూడ వద్ద దింపమని వాజిద్‌కు చెప్పి.. నల్గొండ-మిర్యాలగూడ రోడ్డులో ఇతర నిందితులతో కలిసి వాహనం దిగిపోయాడు. అనంతరం నవీన్ గోవా వెళ్లాడు. అతని సహచరుల నుంచి తీసుకున్న ఐదు సెల్‌ఫోన్‌లను వాడినప్పటికీ.. పోలీసులు అతడిని గోవాలో ఉన్నట్టుగా గుర్తించారు. ఇక, ఈ కేసుకు సంబంధించి 32 మందిని డిసెంబర్ 10న పోలీసులు అరెస్టు చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios