Asianet News TeluguAsianet News Telugu

Congress: వైసీపీ ఎంపీపై అద్దంకి దయాకర్ ఫైర్.. మోడీని జోకడమే పనిగా.. !

వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి పై తెలంగాణ కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ మండిపడ్డారు. మోడీని జోకడమే పనిగా పెట్టుకున్నారని, మోడీ వద్ద మార్కులు కొట్టడానికి ప్రభుత్వాలను కూలగొట్టుదామనే మాటలు మాట్లాడుతున్నారా? అని నిలదీశారు.
 

addanki dayakar slams ycp mp vijayasai reddy over his comments on telangana govt in rajyasabha kms
Author
First Published Feb 7, 2024, 7:04 PM IST | Last Updated Feb 7, 2024, 7:04 PM IST

Telangana Congress: వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి పార్లమెంటులో తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వం కూలిపోతుందని ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలను టీ కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ మండిపడ్డారు. మోడీని జోకడమే పనిగా పెట్టుకున్నారా? అని ప్రశ్నించారు. మోడీ ప్రాపకం పొందడానికి ప్రభుత్వాలను కూలగొట్టే మాటలు మాట్లాడారా? అని నిలదీశారు. ఈ పరిణామంతో విజయసాయి రెడ్డి ఎంతటి రాజకీయ అజ్ఞానో అర్థం అయిందని అన్నారు.

అసలు ఆయనను పెద్దల సభకు ఎలా వెళ్లాడో తనకు అర్థం కావడం లేదని అద్దంకి దయాకర్ అన్నారు. మోడీ వద్ద మార్కులు పొందడానికి ఎన్నికల్లో ప్రజా ఆశీర్వాదంతో ఏర్పడ్డ ప్రభుత్వాలను కూలగొట్టుదామని నిండు సభలో మాట్లాడతారా? అని మండిపడ్డారు.

సీఏ నుంచి రాజకీయ నాయకుడిగా లేదా.. జగన్‌కు సలహాదారుడిగా ఉండి రాజకీయ నాయకుడిగా మారినట్టు ప్రభుత్వాలు మారిపోవని అద్దంకి దయాకర్ పేర్కొన్నారు. ఇప్పుడు ఏపీలో షర్మిల కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం అనేది భరించలేక.. ఈ అక్కసు వెళ్లగక్కుతున్నారని అర్థం అవుతున్నదని కామెంట్ చేశారు. కేసీఆర్‌తో అంటకాగుతున్న మీరు.. ఈ వ్యాఖ్యలు చేయడం దేనికి సంకేతమో ఆలోచన చేయండి అంటూ పేర్కొన్నారు. 

Also Read: Medaram Jathara: 21 నుంచి సమ్మక్క, సారలమ్మ జాతర.. మేడారం జాతర చరిత్ర మీకు తెలుసా?

కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏపీకి సమస్యలు రాకుండా రేవంత్ రెడ్డి చూసుకుంటారని అద్దంకి దయాకర్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వంపై ఇంత అక్కసు ఎందుకు అని ప్రశ్నించారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios