సినీనటి రేవతి చౌదరి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఇవాళ ఉదయం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆమె సైకిల్ కండువా కప్పుకున్నారు.
సినీనటి రేవతి చౌదరి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఇవాళ ఉదయం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆమె సైకిల్ కండువా కప్పుకున్నారు.
ఈ కార్యక్రమంలో టీటీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ తదితర నేతలు పాల్గొన్నారు. తెలంగాణ ఎన్నికల్లో భాగంగా చంద్రబాబు ఇవాళ పార్టీ ముఖ్య నేతలతో సమావేశం అయ్యారు. సీట్లు, పొత్తులు, అభ్యర్థుల ఎంపిక, ప్రచారంలో అనుసరించాల్సిన వ్యూహాలపై ఆయన నేతలతో చర్చించారు.