తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ పై సినీ నటి గౌతమి షాకింగ్ కామెంట్స్ చేశారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్న కేసీఆర్ ఇటీవల తెలంగాణ అసెంబ్లీని రద్దు చేసిస సంగతి తెలిసిందే. కాగా.. తెలంగాణలో ఇలా ముందస్తు ఎన్నికలకు వెళ్లడం విషయంపై ఆమె స్పందించారు.

‘‘రాజకీయాల్లో భాగం పంచుకునేందుకు ప్రతి ఒక్కరికీ బాధ్యత ఉంది. తెలంగాణలో ముందస్తు ఎన్నికల వల్ల ప్రజలకు ఎలాంటి మేలు జరుగుతుందనేది తరువాతి విషయం. కానీ మేలు జరుగుతుందనే నమ్మకంతోనే ఓ అద్భుతమైన మెజారిటీ ఇచ్చి... ‘నిండు టర్మ్ నడుపుతారు. మాకు అన్ని పనులూ జరుగుతాయి. మా భవిష్యత్‌ను సరిదిద్దుతారు’ అనే నమ్మకంతో ప్రజలున్నప్పుడు... ముందస్తు ఎన్నికలతో ప్రజలకు ఎంతవరకూ న్యాయం చేయగలుగుతున్నామనేది ఆలోచించాల్సిన విషయం’’ అని గౌతమి చెప్పుకొచ్చారు.

read more news

అది పవన్ సొంత విషయం.. తన కమిట్ మెంట్ తనకి ఉంటుంది...గౌతమి