క్రమశిక్షణను ఉల్లంఘించిన వారెవరైనా వారిపై చర్యలు తీసుకొంటామని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇంచార్జీ మాణికం ఠాగూర్ చెప్పారు. కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఠాగూర్ వ్యాఖ్యలకు ప్రాధాన్యత నెలకొంది. 

హైదరాబాద్: క్రమశిక్షణను ఉల్లంఘించిన వారిపై చర్యలు తప్పవని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇంచార్జీ మాణికం ఠాగూర్ హెచ్చరించారు..ఆదివారం నాడు Manickam Tagoreనిర్మల్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా నిర్వహించిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఠాగూర్ మాట్లాడారు.ప్రజలతో అనుబంధం ఉన్న పార్టీ అని ఠాగూర్ చెప్పారు. కార్యకర్తలు, ఓటర్లు సరిగా ఉన్నా Congress నేతల మధ్య సమన్వయం లేదన్నారు. కాంగ్రెస్ లో డ్రామాలు, నాటకాలు కుదరవని ఆయన తేల్చి చెప్పారు..తెలంగాణ ఏర్పాటు విషయంలో BJP డ్రామాలాడుతుందని ఆయన విమర్శించారు. రాష్ట్రాన్ని సీఎం KCRకుటుంబం దోచుకొంటుందని ఠాగూర్ ఆరోపించారు.

పార్టీలో చోటు చేసుకొన్న పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ కు Resign చేయాలని నిర్ణయం తీసుకొన్నానని జగ్గారెడ్డి ప్రకటించారు. అయితే పార్టీ సీనియర్లు కొందరు ఈ విషయమై జగ్గారెడ్డితో phone లో చర్చించారు. దీంతో జగ్గారెడ్డి తన రాజీనామా నిర్ణయాన్ని 15 రోజుల పాటు వాయిదా వేసుకొన్నారు. అయితే ఈ నెల 25న పార్టీ కార్యకర్తలతో జగ్గారెడ్డి సమావేశమయ్యారు. 

గురువారం నాడు CLP నేత Mallu Bhatti Vikramarka సహా ఆ పార్టీ ఎమ్మెల్యేలు కొందరు జగ్గారెడ్డితో భేటీ అయ్యారు. పార్టీలో చోటు చేసుకొన్న పరిణామాలను జగ్గారెడ్డి వారితో చర్చించారు. రాజీనామాపై పార్టీ నేతలు జగ్గారెడ్డితో చర్చించారు. రాజీనామా నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు. 

ఇదిలా ఉంటే పార్టీ చీఫ్ Sonia Gandhi, Rahul Gandhiతో పాటు పార్టీ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ మాణికం ఠాగూర్, ఆ పార్టీ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ లను కూడా కలవాలని జగ్గారెడ్డి భావిస్తున్నారు. అయితే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత పార్టీ సీనియర్లు తనకు సమయం కేటాయించే అవకాశం ఉందని జగ్గారెడ్డి అభిప్రాయపడ్డారు. ఇవాళ సమావేశంలో తాను కార్యకర్తలతో తాను చెప్పాలనుకొన్న అంశాలను చెబుతానని చెప్పారు. అయితే అన్నీ విషయాలను కూడా క్యాడర్ కు చెప్పలేనని జగ్గారెడ్డి వివరించారు.తన విషయమై టీపీసీసీ చీఫ్ Revanth Reddy చేసిన వ్యాఖ్యల ను కూడా జగ్గారెడ్డి తప్పుబట్టారు.

జగ్గారెడ్డి వ్యవహారాన్ని కుటుంబంలో సమస్యగా చెప్పిన రేవంత్ రెడ్డి.. అన్ని సమస్యలను తామే పరిష్కరించుకుంటామని చెప్పారు. మీడియా ఈ అంశాన్ని పెద్దగా చూపాల్సిన అవసరం లేదన్నారు. టీ కప్పులో తుపాను మాదిరే ఈ సమస్య కూడా పరిష్కారమవుతుందని చెప్పారు. తమ పార్టీలో విభేదాలు లేవని, భేదాభిప్రాయాలు మాత్రమే ఉన్నాయని అన్నారు.

తనను టీఆర్ఎస్ కోవర్ట్ అంటున్నారని ఈ అవమానాలను భరించలేనని పేర్కొంటూ జగ్గారెడ్డి ఈ నెల 19న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తానని ప్రకటించారు. అంతేకాదు సోనియాగాంధీ, రాహుల్ గాంధీలకు ఆయన లేఖలు రాశారు. 

పార్టీ వీడినా గాంధీ కుటుంబంపై గౌరవం తో ఉంటానని.. పార్టీలో ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడితే కోవర్ట్ అని కొందరు యూట్యూబ్ చానెల్స్ ద్వారా ప్రచారం చేస్తున్నారని జగ్గారెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ లో జరుగుతున్న అవమానాలు భరించలేకనే రాజీనామా చేసి ప్రజల్లో స్వతంత్రంగా సేవ చేస్తానని ఆయన చెప్పారు. పార్టీలో ఎవ్వరు కోవర్టులో అధిష్టానం గుర్తించాలని జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. 2017లో ఎవ్వరూ అధినేత రాహుల్ గాంధీ సభ పెట్టడానికి ముందుకు రాకుంటే తాను కోట్లు ఖర్చుపెట్టి సభ నిర్వహించానని. ఆయన గుర్తు చేశారు.