వరంగల్: ఓ గిరిజన మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న సబ్ ఇన్ స్పెక్టర్ జగదీష్ కు కష్టాలు ప్రారంభమయ్యాయి. ఆయనపై ఉన్నతాధికారులు క్రమశిక్షణా చర్యలు తీసుకున్నారు. అందులో భాగంగా  ఆయనను పోలీసు కమిషనర్ ఆఫీసుకు అటాచ్ చేశారు. 

జీడిగడ్డ తండాలో మహిళతో రాసలీలల్లో మునిగి ఉన్న సమయంలో స్థానికులు సబ్ ఇన్ స్పెక్టర్ జగదీష్ ను పట్టుకున్నట్లు తెలుస్తోంది. గ్రామ పెద్దలతో మాట్లాడిన జగదీష్ బుకాయిస్తూ తిమ్మిని బమ్మిని చేసే ప్రయత్నం చేసాడు.

అయితే, తమను సబ్ ఇన్ స్పెక్టర్ జగదీష్ వేధింపులకు గురి చేస్తున్నాడని కొంత మంది కమిషనర్ కు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఆ సంఘటనపై నర్సంపేట డివిజన్ ఎసిపి సునీత మోహన్ ప్రాథమిక విచారణ జరిపారు. 

కొంత మంది స్థానికులు గాంబ్లింగ్ జరుగుతోందని చెప్పి తనను ట్రాప్ లో పడేశారని విచారణలో జగదీష్ చెప్పాడు.