జనావాసాల మధ్య ఆసిడ్ ఫ్యాక్టరీని నడపుతూ ప్రమాదాలకు కారణమవుతుంది అంబర్ పేట్ లోని ఓ ఆసిడ్ తయారీ సంస్థ. అంబర్ పేట్ నియోజకవర్గంలోని మారుతి నగర్ లో కొంత కాలం నుంచి జనవాసుల మధ్యలో  అక్రమంగా ఆసిడ్ ఫ్యాక్టరీ నడుపుతున్నారు. 

"

ఈ రోజు ఒక్కసారిగా ఆసిడ్ ట్యాంక్ బ్లాస్ట్ అయ్యి యాసిడ్ మొత్తం జనావాసాల్లోకి వచ్చింది. దీంతో చాలామంది అస్వస్థతకు గురయ్యారు. విషయం తెలుసుకున్న మీడియా అక్కడికి వెళ్లి వాస్తవాలు కనుక్కునే ప్రయత్నం చేసింది. 

ఈ ఫ్యాక్టరీ మీద అధికారులకు ఎన్నిసార్ల ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని, ఇప్పుడు వచ్చి హడావుడి చేస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ఫ్యాక్టరీకి ఎలాంటి పర్మిషన్లు లేవని తేలింది. 

అంతేకాదు ఇటీవలే  ఈ ఆసిడ్ ఫాక్టరీ లో స్విమ్మింగ్ పూల్ కూడా ప్రారంభించారని దీనిపై కూడా అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.