జగిత్యాల జిల్లాలో దారుణం జరిగింది. ఓ మహిళపై దుండగుడు యాసిడ్‌దాడి చేశాడు. ఇబ్రహీంపట్నం మండలం తిమ్మాపూర్ లంబాడి తండా కు చెందిన స్వాతి అనే (24) వితంతుపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు యాసిడ్‌తో దాడి చేశారు.

ప్రాణాపాయ స్థితిలో ఉన్నా స్వాతిని మెట్‌పల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. స్వాతికి స్వాతికి ఇబ్రహీంపట్నం మండలం డబ్బా గ్రామానికి చెందిన వెంకటికి ఇచ్చి వివాహం చేశారు. అయితే పెళ్లయిన ఏడాదికే వెంకటి అనారోగ్యంతో మృతి చెందాడు. వీరికి ఒక కుమారుడు.

ఈ క్రమంలో బుధవారం ఓ వివాహా కార్యక్రమానికి హాజరు కావటానికి వచ్చిన స్వాతి, ఆమె చెల్లెలు రోడ్డుపై వెళ్తుండగా.. తిమ్మాపూర్ బస్టాండు సమీపంలో హెల్మెట్ పెట్టుకోని బైక్ పై వచ్చిన ఇద్దరు యాసిడ్ తో దాడి చేసి వెళ్లిపోయారు. దీనిపై స్పందించిన టీఆర్ఎస్ నేత, ఎంఎల్‌సీ కవిత బాధితురాలికి మెరుగైన చికిత్స అందించాల్సిందిగా అధికారులను ఆదేశించారు.