Asianet News TeluguAsianet News Telugu

చాక్లెట్ ఆశచూపి మైనర్ బాలికపై అత్యాచారం.. కామాంధుడికి 20 ఏళ్ల జైలు, ఆదిలాబాద్ కోర్ట్ సంచలన తీర్పు

మైనర్ బాలికపై అత్యాచారం చేసిన కేసులో కామాంధుడికి 20 ఏళ్ల జైలు, రూ.2 వేల జరిమానా విధిస్తూ ఆదిలాబాద్ స్పెషల్ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ సంచలన తీర్పు వెలువరించింది. కేవలం నాలుగున్నర నెలల్లోనే ఈ కేసులో తీర్పు రావడం పట్ల పోలీసులు హర్షం వ్యక్తం చేశారు. 
 

accused in minor girl rape case sentenced to 20 years imprisonment and fine in adilabad
Author
First Published Sep 27, 2022, 4:50 PM IST

ఐదు రూపాయలు ఆశ చూపి మైనర్ బాలికపై అత్యాచారం చేసిన కేసులో ఆదిలాబాద్ స్పెషల్ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ సంచలన తీర్పు వెలువరించింది. నేరస్తుడికి 20 ఏళ్ల జైలు శిక్ష, రూ. 2 వేల జరిమానా విధించింది. ఉట్నూరులో మైనర్ బాలికపై దాడి కేసులో కోర్ట్ ఈ తీర్పు చెప్పింది. కేవలం నాలుగున్నర నెలల్లోనే ఈ కేసులో తీర్పు రావడం పట్ల పోలీసులు హర్షం వ్యక్తం చేశారు. 

ఇకపోతే.. గత నెలలో మైనర్ బాలికపై అత్యాచారం కేసులో కర్నూలు మొదటి ఏడీజీ కోర్టు జడ్జి సంచలన తీర్పు ఇచ్చారు. కోవెలకుంట్ల మండలం ఉప్పునూరులో బాలికపై అత్యాచారం చేసిన నిందితుడు జింకల పుల్లయ్యకు 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.5 వేల  జరిమానా విధించారు. 2019లో వరుసకు మనుమరాలయ్యే బాలికపై 60 ఏళ్ల పుల్లయ్య అత్యాచారం పాల్పడ్డాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి సాక్ష్యాలను కోర్టు ముందుంచారు. నేరం రుజువు కావడంతో నిందితుడికి శిక్ష పడింది. 

ALso REad:మనుమరాలి వరుసయ్యే బాలికపై అత్యాచారం.. వృద్ధుడికి 20 ఏళ్ల జైలు, నంద్యాల కోర్ట్ సంచలన తీర్పు

ఇదిలా ఉండగా, జూలై 1న ఇలాంటి కేసులో నిందితుడికి త్రిపుర కోర్టు మరణశిక్ష విధించింది. నాలుగున్నరేళ్ల బాలికపై ఓ కామాంధుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఆమె ఎవరికైనా చెబుతుందనుకున్నాడో ఏమో హత్య చేశాడు. ఘటన వెలుగులోకి రావడంతో ఈ వ్యక్తిని అరెస్టు చేశారు. త్రిపురలోని ఖోవై జిల్లా కోర్టు అతనికి మరణశిక్ష విధించింది. జిల్లా కోర్టు, ప్రత్యేక పోక్సో చట్టం న్యాయమూర్తి శంకరి దాస్ ఈ తీర్పు వెలువరించారు. 

ఈ కేసు పూర్వాపరాలలోకి వెళితే… అగర్తలలోని  ఖోవై జిల్లాలో ఈ దారుణ ఘటన జరిగింది. అక్కడ తెలియమురా ప్రాంతానికి చెందిన నాలుగున్నరేళ్లు బాలిక నిరుడు ఫిబ్రవరిలో ఇంటిముందు ఆడుకుంటుంది. అప్పటివరకు ఆడుకుంటున్న చిన్నారి.. కాసేపటికే కనిపించకుండా పోయింది. ఎంత వెతికినా ప్రయోజనం లేకపోయింది. అలా తప్పిపోయిన చిన్నారి... ఆరు రోజుల తర్వాత  ఒంటినిండా గాయాలతో విగతజీవిగా కనిపించింది.

దీంతో బాధిత బాలిక కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు, పోలీస్ స్టేషన్ లో వారి ఫిర్యాదు మేరకు  పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నిందితుడు కాళీ చరణ్ త్రిపురగా గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. అతని మీద అత్యాచారం, హత్య, సాక్ష్యాలను నాశనం చేయడం... సహా పలు కేసులు నమోదు చేశారు. ఈ కేసును దర్యాప్తు చేసిన పోలీసు ఇన్స్పెక్టర్ బిద్యేశ్వర్ సిన్హా తాజాగా నివేదికను, 35 మంది సాక్షుల వాంగ్మూలాలు కోర్టుకు సమర్పించారు. విచారణ తర్వాత నిందితుడు దోషిగా నిర్ధారించిన కోర్టు మరణ శిక్ష విధించింది. ఖోవై జిల్లాలో మరణశిక్ష విధించడం ఇదే తొలిసారి. 

Follow Us:
Download App:
  • android
  • ios