సంగారెడ్డిలో ఓ లారీ అదుపుతప్పి గుడిసెల మీదికి దూసుకువెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. 

సంగారెడ్డి : తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం సంభవించింది. సంగారెడ్డి జిల్లా కొల్లూరు ఔటర్ రింగ్ రోడ్డు వద్ద లారీ బీభత్సం సృష్టించింది. ఎగ్జిట్ గేట్ వద్ద లారీ అదుపు తప్పి గుడిసెలపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు కార్మికులు మరణించారు. లారీ పటాన్ చెరు నుంచి శంషాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. సంఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.