ఓటుకు నోటు కేసులో విచారణకు హాజరుకాకపోవడంపై  టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి డ్రైవర్‌, పీఏ ఏసీబీ కోర్ట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. వీరిద్దరికి  బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది. ఆగస్టు 9న విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. 

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసుకు సంబంధించి టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి డ్రైవర్‌, పీఏపై ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది. సాక్షులుగా విచారణకు హాజరుకావాలని ఓటుకు నోటు కేసు సమయంలో రేవంత్‌ రెడ్డితో సన్నిహితంగా ఉన్న ఆయన డ్రైవర్‌ రాఘవేందర్‌రెడ్డి, వ్యక్తిగత సహాయకుడు సైదయ్యకు న్యాయస్థానం సమన్లు జారీ చేసింది. సమన్లు తీసుకున్నప్పటికీ ఇవాళ విచారణకు గైర్హాజరు కావడంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇద్దరికీ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది. ఆగస్టు 9న విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. మరోవైపు నిందితుల్లో ఒకరైన ఉదయ్‌సింహా ఇవాళ విచారణకు హాజరయ్యారు. అనంతరం ఈ కోర్టులో విచారణను న్యాయస్థానం రేపటికి వాయిదా వేసింది. 

Also REad:ఓటుకు నోటు కేసులో రేవంత్ కాల్ డేటా... ఏసిబి కోర్టుకు బిఎస్ఎన్ఎల్ నోడల్ అధికారి బాల్ సింగ్