Asianet News TeluguAsianet News Telugu

కామారెడ్డి: పోలీసు అధికారుల ఇళ్లపై ఏసీబీ దాడులు

కామారెడ్డి జిల్లా పోలీస్ అధికారుల ఇళ్లపై వరుసగా మూడో రోజు ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఇప్పటికే పట్టణ సీఐ జగదీశ్‌ను అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు.. అతని నుంచి కీలక ఆధారాలు సేకరించారు

acb raids in kamareddy police officials houses ksp
Author
Kamareddy, First Published Nov 22, 2020, 5:37 PM IST

కామారెడ్డి జిల్లా పోలీస్ అధికారుల ఇళ్లపై వరుసగా మూడో రోజు ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఇప్పటికే పట్టణ సీఐ జగదీశ్‌ను అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు.. అతని నుంచి కీలక ఆధారాలు సేకరించారు.

నిన్న ఉదయం నుంచి కామారెడ్డి డీఎస్పీ కార్యాలయంలో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. పలు రికార్డులను పరిశీలిస్తూ డీఎస్పీని విచారిస్తున్నారు అధికారులు. దీనిలో భాగంగా పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. 

ఐపీఎల్‌ బెట్టింగ్ వ్యవహారం జిల్లా పోలీస్ శాఖను కుదిపేస్తోంది. బెట్టింగ్‌ కేసులో నిందితుడికి స్టేషన్‌ బెయిల్‌ ఇచ్చేందుకు రూ.5 లక్షలు లంచం డిమాండ్‌ చేసిన కామారెడ్డి సీఐ జగదీశ్‌ను ఇప్పటికే ఏసీబీ అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించింది.

రెండు రోజుల నుంచి అతని ఇంట్లో సోదాలు చేస్తోంది. నేడు కూడా సోదాలు కొనసాగే అవకాశం ఉంది. సీఐ సన్నిహితుల పాత్రపైనా ఏసీబీ అధికారులు ఆరాతీస్తున్నారు. ఇక  బెట్టింగ్ రాయుళ్లకు మధ్యవర్తిగా వ్యవహరించిన సుజయ్ కూడా ఏసీబీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

Follow Us:
Download App:
  • android
  • ios