మర్రిగూడ తహశీల్దార్ ఇంట్లో ఏసీబీ దాడులు, భారీగా నగదు, బంగారం..
మర్రిగూడ తహసీల్దార్ మహేందర్ రెడ్డి ఇంట్లో ఏసీబీ దాడులు నిర్వహించింది. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణలతో ఈ దాడులు జరిగాయి.

రంగారెడ్డి : శనివారం ఏసీబీ అధికారులు మర్రిగూడ తహసిల్దార్ మహేందర్ రెడ్డి ఇంట్లో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఏసీబీ అధికారులకు తహసిల్దార్ మహేందర్ రెడ్డి ఇంట్లో రూ. రెండు కోట్ల నగదు లభించింది. దీంతోపాటు.. ఏసీబీ అధికారులు భారీగా ఆస్తులు, బంగారం గుర్తించారు. మహేందర్ రెడ్డికి చెందిన 15 ప్రాంతాల్లో ఏసీబీ సోదాలు నిర్వహించింది. మహేందర్ రెడ్డి ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయని ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో ఏసీబీ దాడులకు దిగింది. ప్రస్తుతం నల్గొండ జిల్లా మర్రిగూడ తహసిల్దారుగా ఆయన పనిచేస్తున్నారు.