బిల్లుల క్లియరెన్స్‌కు సంబంధించి కాంట్రాక్టార్ నుంచి లక్ష లంచం డిమాండ్ చేసిన నేరంపై రామగుండం ఆర్డీవో శంకర్ కుమార్‌పై ఏసీబీ అధికారులు ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేశారు

రామగుండం ఆర్డీవో (ramagundam rdo) శంకర్ కుమార్‌పై (shankar kumar) ఆదాయానికి మంచిన ఆస్తుల కేసు నమోదు చేసింది ఏసీబీ. ఇటీవల నిర్వహించిన తనిఖీల్లో దాదాపు కోటి రూపాయలకు సంబంధించిన ఆస్తులను ఏసీబీ గుర్తించింది. ఈ నేపథ్యంలో శంకర్ కుమార్‌ను అరెస్ట్ చేసి.. ఆయనను రిమాండ్‌కు తరలించారు ఏసీబీ అధికారులు (anti corruption bureau) . అయితే తెలంగాణ రాష్ట్రంలో మూడు రోజుల్లోనే ముగ్గురు ఉన్నతాధికారులపై డీఏ కేసులు నమోదవ్వడం చర్చనీయాంశమైంది. బాలానగర్ సబ్ రిజిస్ట్రార్ ఎండీ నిజాముద్దీన్, నర్సాపురం ఆర్డీవో బండా అరుణా రెడ్డి తాజాగా శంకర్ కుమార్‌పైనా ఇదే కేసు నమోదవ్వడం గమనార్హం. 

2020లో కోవిడ్ (covid 19) నివారణ కొరకు వీధులలో వెదజల్లిన హైడ్రోక్లోరైడ్ ద్రావణం పిచికారీకి సంబంధించిన బిల్లుల చెల్లింపులో కాంట్రాక్టర్ రజనీకాంత్ వద్ద శంకర్ కుమార్ రూ.లక్ష డిమాండ్ చేశారు. ఈ మేరకు రామగుండం కార్పోరేషన్ ఇంచార్జి కమిషనర్‌గానూ, పెద్దపల్లి ఆర్డీవో గానూ శంకర్ కుమార్ విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే కాంట్రాక్టర్ రజనీకాంత్ బిల్లుల చెల్లింపు కోసం మద్యవర్తి ద్వారా రూ.లక్ష డిమాండ్ చేయడంతో సదరు కాంట్రాక్టర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.

అధికారుల సలహా మేరకు ఆర్డీవో డిమాండ్ చేసిన లంచం డబ్బును మద్యవర్తిగా ఉన్న ఆర్డీవో అనుచరుడు మల్లికార్జున్‌కు రూ.లక్ష నగదు ఇస్తుండగా ఏసీబీ అధికారులు పెద్దపల్లి ఆర్డీవో కార్యాలయంలో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. పట్టణ ప్రగతిలో భాగంగా హైడ్రోక్లోరైడ్ ద్రావణం సరఫరాకు సంబంధించిన బిల్లులో సుమారు రూ.9 లక్షల 25వేల చెల్లించాల్సి ఉండగా, రూ.లక్ష డిమాండ్ చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.