ఉదయం నుండి సోదాలు:బంజారాహిల్స్ సీఐ, ఎస్‌ఐలపై ఏసీబీ కేసు

బంజారాహిల్స్ సీఐ నరేందర్ పై ఏసీబీ అధికారులు  కేసు నమోదు చేశారు.  సీఐతో పాటు ఎస్ఐ, హోంగార్డులపై  కూడ ఏసీబీ అధికారులు కేసులు పెట్టారు.

ACB Filed Case Against Banjarahills CI Narender and SI naveen Reddy lns


హైదరాబాద్: బంజారాహిల్స్ ఇన్స్ పెక్టర్  నరేందర్ పై ఏసీబీ అధికారులు  శుక్రవారంనాడు కేసు నమోదు చేశారు. లంచం డిమాండ్ చేస్తున్నారని  ఏసీబీకి సీఐ నరేందర్ పై ఫిర్యాదులు అందాయి.  కొంత కాలంగా బంజారాహిల్స్ సీఐ నరేందర్ పై  అవినీతి ఆరోపణలు వస్తున్నాయి.

స్కైలాంజ్ పబ్ ఎండి రాజేశ్వర్ రెడ్డిని  ఇన్స్ పెక్టర్ నరేందర్ ను బెదిరింపులకు గురి చేసినట్టుగా  ఏసీబీ అభియోగాలు మోపింది. వాట్సాప్ కాల్స్ లో  స్కైలాంజ్ పబ్ ఎంపీ రాజేశ్వర్ రెడ్డిని ప్రతి నెల రూ. 4.5 లక్షలు ఇవ్వాలని సీఐ  డిమాండ్ చేశారని ఏసీబీ ఆరోపిస్తుంది.మరో ఇదే కేసులో  ఎస్ఐ నవీన్ రెడ్డి, హోంగార్డు హరిలపై కేసు నమోదు చేసింది ఏసీబీ. బంజారాహిల్స్ సీఐ నరేందర్ రెడ్డి నివాసంలో కూడ  ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఇవాళ ఉదయం నుండి బంజారాహిల్స్  పోలీస్ స్టేషన్ లో ఏసీబీ అధికారులు   సీఐ, ఎస్ఐ, హోంగార్డులను  విచారిస్తున్నారు.

గతంలో సీఐకి రూ. 50 వేలు ఇస్తూ  రాజేశ్వర్ రెడ్డి వీడియాను రికార్డు చేశారు.  ఈ వీడియోను  ఏసీబీ అధికారులకు సాక్ష్యంగా చూపినట్టుగా సమాచారం.  పోలీస్ స్టేషన్ లోని సీసీటీవీ పుటేజీని కూడ  ఏసీబీ అధికారులు పరిశీలిస్తున్నారని సమాచారం. ఇదిలా ఉంటే విచారణ సమయంలో  సీఐ నరేందర్ చాతీలో నొప్పి అంటూ కిందపడిపోయాడు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios