అవినితీ కేసులో అరెస్టయి, ప్రస్తుతం జైల్లో వున్న మెదక్ అడిషనల్ కలెక్టర్ నగేశ్‌కు ఏసీబీ కోర్టు బెయిల్ నిరాకరించింది. అయితే పలువురికి మాత్రం న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది.

ఆర్డీవో అరుణ, వసీం, జీవన్‌గౌడ్‌లు బెయిల్ పొందిన వారిలో వున్నారు. కాగా రెండ్రోజుల క్రితం తహశీల్దార్ సత్తార్‌కు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. అదనపు కలెక్టర్‌ నగేష్‌ నిజామాబాద్‌ జిల్లాకు చెందిన వారు.  

Also Read:రూ.100 కోట్లకుపైగా ఆస్తులు: మెదక్ అడిషనల్ కలెక్టర్‌ నగేశ్‌పై కేసు

గ్రూప్‌ -2 ద్వారా సెక్రటేరియట్‌ సర్వీ్‌సకు ఎంపికయ్యారు. సెక్రటేరియట్‌లో ఏఎ్‌సవో, ఎస్‌వోగా పనిచేసి.. డిప్యూటీ కలెక్టర్‌గా పదోన్నతి పొందారు. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా పరిధిలోని కామారెడ్డిలో గతంలో ఆర్‌డీవోగా పనిచేశారు.

కొత్త జిల్లాలు ఏర్పాటైన తర్వాత జగిత్యాల డీఆర్‌వోగా బదిలీపై వెళ్లారు. తర్వాత మెదక్‌కు అదనపు కలెక్టర్‌గా వెళ్లారు. మరో సంవత్సరంలో కన్‌ఫర్డ్డ్‌ హోదాలో ఐఏఎస్‌ అయ్యే అవకాశం ఉన్న సమయంలో ఏసీబీకి పట్టుబడ్డారు. నిరభ్యంతర పత్రం (ఎన్‌వోసీ) జారీ చేసేందుకు రూ.1.12 కోట్లు లంచం డిమాండ్‌ చేసిన కేసులో నగేశ్ అరెస్ట్ అయ్యారు.