Asianet News TeluguAsianet News Telugu

ఫాంహౌస్ కేసు నిందితులకు చుక్కెదురు.. బెయిల్ నిరాకరించిన ఏసీబీ కోర్ట్

మొయినాబాద్ ఫాంహౌస్ కేసు నిందితులకు ఏసీబీ కోర్ట్ షాకిచ్చింది. నిందితులు రామచంద్రభారతి, సింహయాజులు, నందకుమార్‌ల బెయిల్ పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది.

acb court rejects bail petition for moinabad farm house accused
Author
First Published Nov 14, 2022, 4:12 PM IST

మొయినాబాద్ ఫాంహౌస్ కేసు నిందితులకు ఏసీబీ కోర్ట్ షాకిచ్చింది. నిందితులు రామచంద్రభారతి, సింహయాజులు, నందకుమార్‌ల బెయిల్ పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. వీరికి బెయిల్ మంజూరు చేస్తే దర్యాప్తును, సాక్షులను ప్రభావితం చేసే అవకాశం వుందని ప్రభుత్వ తరపు న్యాయవాది వాదించారు. ఈ వాదనపై ఏకీభవించిన ఏసీబీ కోర్ట్ బెయిల్ నిరాకరించింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

కాగా... ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసులో సోమవారం మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేరళ రాష్ట్రంలో నిర్వహించిన సోదాల్లో సిట్ బృందం ఇద్దరిని అదుపులోకి తీసుకుందని సమాచారం. ఏపీ, కర్ణాటక,హర్యానా,కేరళ  రాష్ట్రాల్లో సిట్ బృందం సోదాలు చేస్తుంది.కేరళ రాష్ట్రంలో రామచంద్రభారతితో సంబంధాలున్న డాక్టర్ కోసం సిట్ బృందం ఆరా తీసింది. అయితే సిట్ బృందం వస్తుందనే సమాచారం తెలుసుకున్న డాక్టర్ పారిపోయాడు.కేరళలో డాక్టర్ తో రామచంద్రభారతి సంబంధాలపై సిట్ దర్యాప్తు చేస్తుంది.తుషార్ కి రామచంద్రభారతికి ఈ డాక్టర్ మధ్యవర్తిగా ఉన్నాడని ఆ కథనం తెలిపింది.రామచంద్రభారతితో ఆర్ధిక వ్యవహరాలు జరిపిన ఇద్దరిని సిట్ గుర్తించింది.ప్రశాంత్, శరత్ లు ఆర్ధిక సంబంధాలు  జరిపినట్టుగా సిట్ గుర్తించిందని సమాచారం.వీరిని సిట్ బృందం అదుపులోకి తీసుకుందని ప్రముఖ తెలుగు మీడియా ఎన్టీవీ  కథనం ప్రసారంచేసింది.

Also Read:టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసు:సిట్ అదుపులో కేరళకు చెందిన ఇద్దరు

గత నెల 26వ తేదీన మొయినాబాద్ ఫాం హౌస్ లో  రామచంద్రభారతి,సింహయాజీ,నందకుమార్ లు ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. అచ్చంపేట  ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు, తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిలను ప్రలోభపెట్టారని ఈ ముగ్గురిపై  కేసు నమోదైంది. ఎమ్మెల్యేల ప్రలోభాల వెనుక  బీజేపీ ఉందని టీఆర్ఎస్ ఆరోపించింది.ఈ ఆరోపణలను బీజేపీ ఖండించింది. ఈ ముగ్గురికి తమకు సంబంధం లేదని బీజేపీ తేల్చి చెప్పింది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios