గారెడ్డి జిల్లాలో అవినీతి అధికారులు ఏసీబీ అధికారులకు చిక్కారు. ఒకే కేసులో 7.50 లక్షల లంచం డిమాండ్ చేసిన మహేశ్వరం ఎంపీడీవో, మాన్సాన్ పల్లి గ్రామపంచాయతీలో ఏసీబీ సోదాలు నిర్వహించింది. రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు ఎండీవో శ్రీనివాస్.

ఐదున్నర ఎకరాల భూమి లేఅవుట్ అనుమతి కోసం లంచం డిమాండ్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇదే కేసులో రూ.5.50 లక్షలు తీసుకుంటూ పంచాయతీ సెక్రటరీ గీత ఏసీబీకి చిక్కారు. రెడ్ హ్యాండెడ్‌గా ఏసీబీకి దొరికారు పంచాయతీ సెక్రటరీ గీత, సర్పంచ్ భర్త, ఉప సర్పంచ్.